GuidePedia

0

కిక్ 2 లో రాకుల్ ప్రీత్ ??

మాస్ మహారాజ రవితేజ కెరీర్లో మైలు రాయిగా నిలిచి పోయే సినిమా కిక్’. నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కిక్ కి సీక్వెల్ గా కిక్ 2 ని నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకి ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కిక్ 2 లో రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా ఎంపిక చేయనున్నారు. కానీ ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ వార్తల ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ ఈ అవకాశం దక్కించుకుంటే, తను కూడా కిక్ 2 తో స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోతుంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి కథ మాటలు వక్కంతం వంశీ అందిస్తున్నాడు. కిక్ తెలుగు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కిక్ 2 పై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. కిక్ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలో కూడా రీమేక్ అయ్యి పెద్ద విజయాన్ని అందుకుంది.

Post a Comment

 
Top