GuidePedia

0

రవితేజకే రంగుపడుద్దటా !!

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చినఘటోత్కచుడుచిత్రాన్ని గుర్తు చేసుకుంటే, అందులో రంగు పడుద్దిఅంటూ ఏవీయస్ చెప్పిన డైలాగ్ గుర్తుకు రాక మానదు. అప్పట్లో చాలా పాపులర్ అయిన ఈ డైలాగ్ ఇప్పటికీ వాడుకలో ఉంది. ఈ పాపులర్ డైలాగ్‌నే టైటిల్‌గా పెట్టి కోన వెంకట్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. రచయితగా స్టార్‌డమ్ సంపాదించుకున్న కోన ఆ మధ్య రామ్ అండ్ జూలియట్అనే లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు రంగు పడుద్దిచిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని బోగట్టా. ఇలాంటి టైటిల్స్ రవితేజ వంటి మాస్ హీరోలకు సరిగ్గా నప్పుతాయి. ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటించనున్నారని వినికిడి.
 

Post a Comment

 
Top