ఎన్టీఆర్ - పూరి మధ్య విభేదానికి కారణం కళ్యాణ్ రామ్ ??
ఎన్టీఆర్ , పూరి జగన్నాథ్ కొత్త సినిమా
ఆగిపోయినట్లు ఫిలింనగర్లో పుకార్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. చివరకు ఆ చిత్ర
నిర్మాత బండ్ల గణేష్ జోక్యంతో అటువంటిది ఏమి లేదని సెప్టెంబర్ 10 నుంచి రెండో షెడ్యుల్ ప్రారంభం కాబోతుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయినా
కానీ ఈ సినిమాపై పుకార్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా వార్త ఏమిటంటే…. ఎన్టీఆర్ , పూరి జగన్నాథ్ ల మధ్య కథ విషయంలో
విబేధాలు రావడానికి కారణం కతెలుస్తుంది కళ్యాణ్ రామ్ అని తెలుస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ కొత్త సినిమా పటాస్ స్టొరీ లైన్ కి దగ్గరగా ఎన్టీఆర్ ,
పూరి జగన్నాథ్ సినిమా ఉంటుందట. అందుకే కథలో మార్పులు చేయమని
ఎన్టీఆర్ దర్శకుడిపై ఒత్తిడి తెచ్చాడట. కానీ పూరి మాత్రం ససేమీరా అనడంతో షూటింగ్ ఆగిపోయినదనే
పుకారు పుట్టుకొచ్చింది. అసలు నిజం ఏదైనా కానీ , ఎన్టీఆర్ ఈ సినిమా
షూటింగ్ లో పాల్గొనే వరకు ఈ సినిమాకు సంబంధించి ఇటువంటి పుకార్లు చాలా వస్తూనే
ఉంటాయని అంటున్నారు కొందరు.
Post a Comment