ఆగడుని వర్మ ఇలా అన్నదేంటి !!
మహేష్‑బాబు
హీరోగా నటించిన 'ఆగడు' సినిమాపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన
శైలిలో స్పందించారు. ఆగడు సినిమా చూసిన తర్వాత తన స్పందనను ట్విటర్ లో
పోస్ట్ చేశారు. దూకుడు, బిజినెస్‑మేన్, పోకిరి సినిమాల్లో
నటించినట్టుగానే ఆగడులోనూ మహేష్‑బాబు
నటించాడని పేర్కొన్నారు.'ఆగడు' రూ.75 కోట్ల సినిమా అయితే మగధీర రూ. 750
కోట్ల సినిమా అంటూ పోలిక తెచ్చారు.
ఈ రెండు చిత్రాలు ఆయా హీరోల కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమాలు
కాబట్టే ఆగడు,
మగధీరకు పోలిక తెచ్చానని రాంగోపాల్ వర్మ
వివరించారు. భారీ అంచనాల నడుమ ఆగడు సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు
వచ్చింది.

Post a Comment