GuidePedia

0

సిద్దార్థ్ కి సమాంత షాక్ - అతనితో సీక్రెట్ ఎఫైర్ ??

సౌత్ ఇండస్ట్రీలో వున్న అగ్రకథానాయికలందరికీ తలదన్నేసి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న గ్లామర్ డాల్ సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. నిత్యం షూటింగులతో బిజీగా వుండటం వల్ల ఏనాడూ తన వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో మాట్లాడని సమంత.. తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను బహిర్గతం చేసింది. దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా తనకూ, సిద్ధార్థకు మధ్య వున్న రిలేషన్ షిప్ గురించి ఈ గ్లామర్ డాల్ కుండబద్ధలు కొట్టేసింది. ఇన్నాళ్లవరకు తనకూ, సిద్ధార్థ మధ్య వున్నది కేవలం స్నేహబంధం మాత్రమేనని, తమమధ్య ఎటువంటి ప్రేమాయణం సాగడం లేదని సమంత స్పష్టం చేసేసింది.
అయితే కోలీవుడ్ సమాచారం ప్రకారం.. సమంత ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో కలిసి సీక్రెట్ గా ఎఫైర్ నడుపుతోందని.. ఒకరికొకరు చాలా క్లోజ్ గా రిలేషన్ ను కొనసాగిస్తున్నారని వార్తలు జోరందుకున్నాయి. ఎవరికీ తెలియకుండా రాత్రిళ్లు షికార్లకు వెళ్లడంతోపాటుఅప్పుడప్పుడు కొన్ని ప్రైవేట్ ఫంక్షన్స్ కి కూడా అటెండ్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే షూటింగ్ కంప్లీట్ అయిన అనంతరం వెంటనే సదరు స్పాట్ నుంచి వెళ్లిపోతోందని.. తాను ఎక్కడికి ఎవరితో వెళుతున్నాననే సమాచారాలు కూడా ఇవ్వడం లేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ వ్యాపారవేత్తను తెరమీదకు రానీయకుండా సమంత చాలా జాగ్రత్తలే పాటిస్తోందనితన ప్రేమవ్యవహారం బయటకు తెలియనివ్వకుండా విషయాలన్నింటికీ చాలా సీక్రెట్ గా దాచుతోందని చెప్పుకుంటున్నారు. వీరిద్దరూ పీకల్లోతుదాకా ప్రేమలో మునిగిపోయారనిత్వరలోనే ఈ విషయాన్ని సమంత అధికారికంగా బయటపెట్టే అవకాశాలున్నాయని తెలుపుతున్నారు.
ఇదిలావుండగా.. సమంత, సిద్ధార్థను పూర్తిగా వదిలేసిందనిఈమధ్య వీరిద్దరు కలుసుకున్న దాఖలాలు కూడా లేవని చెబుతున్నారు. పైగా తాజాగా ఓ రిపోర్టర్ సమంతను తనకూ, సిద్ధార్థ్ మధ్య వున్న రిలేషన్ షిప్ గురించి అడిగితే అందుకు సమాధానంగా ఈ అమ్మడు… ‘‘సిద్ధార్థ జస్ట్ నాకు ఫ్రెండ్ మాత్రమే. ఫ్రెండ్ గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పడానికి ఏముంటుంది..?’’ అని ఝలకిచ్చింది. దీంతో సమంత, సిద్ధార్థను వదిలేసి ఎవరో వ్యాపారవేత్తను వలలో వేసుకుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సిద్ధార్థ చేతిలో సినిమాలు ఎక్కువగా లేవు.. టాలీవుడ్ లో అతని ఇమేజ్ పూర్తిగా డామేజ్ కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో తన స్టార్ ఇమేజ్ కి ఎక్కడ
దెబ్బపడుతుందోనన్న భయంతోనే సమంత, సిద్ధార్థతో దూరంగా జరుగుతోందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే అమ్మడు ఓ వ్యాపారవేత్తతో ఫుల్లుగా ప్రేమాయణం నడుపుతోందంటూ కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

Post a Comment

 
Top