GuidePedia

0
శ్వేతా బసు తో నా నెక్స్ట్ మూవీ : బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా
గతవారం రోజులుగా హీరోయిన్ శ్వేతబసు గురించిన వార్తలతో మీడియా హోరెత్తిపోతోంది. టాలీవుడ్ సినిమా రంగ పరిశ్రమ చీకటి కోణాల పై ఆమె అరెస్టు అనేక చర్చలకు తెర తీసింది. దీనికి తోడు శ్వేతబసు కూడ అనేకమంది టాప్ హీరోయిన్స్ తాను చేసిన తప్పులనే చేస్తున్నారు అని అనడంతో ఈ వార్త జాతీయస్థాయి మీడియాకు కూడ సంచలన వార్తగా మారింది.  శ్వేత ఈ కేసుల ఊబిలొ చిక్కు కావడంతో ఆమె కెరియర్ అయిపోయింది అని ఇక్కడి మీడియా వార్తలు వ్రాస్తుంటే శ్వేతబసు మంచి నటి అని చెపుతూ ఆమె నటిస్తానంటే తన సినిమాలో ఖచ్చితంగా అవకాశమిస్తానని బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాదు ఇక పై శ్వేతబసు గురించి ఫోటోలు, వార్తలు నెగిటివ్ గా రాయడం మానుకోవాలని ఆయన మీడియాకు సలహా ఇచ్చారు. ఇక్బాల్చిత్రం ద్వారా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా జాతీయ అవార్డును పొందిన శ్వేతబసు విషయంలో టాలీవుడ్ కు ఎంతో దూరంలో ఉన్న బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా శ్వేతకు బహిరంగ మద్దతు తెలపడం  శ్వేతబసు కు కొండంత అండ అనుకోవాలి.  ఈ అనుకోని అదృష్టం శ్వేత కెరియర్ ను మలుపు తిప్పు తుందేమో చూడాలి.

Post a Comment

 
Top