రామ్ చరణ్ వద్దనాడు - రవితేజ రమ్మనాడు
‘ఆగడు’ సినిమాతో అంచనాలు తలక్రిందులయిన
డైరెక్టర్ శ్రీనువైట్ల మళ్ళీ వెలిగిపోయేందుకు కధ సిద్ధం
చేసుకుంటున్నాడు. మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోతో తన
అదృష్టంమరోసారి పరీక్షించుకునేందుకు
సిద్ధం అవుతున్నాడు. అతడితో చేసిన మూడు సినిమాలు హిట్ కావటంతో..,
నాల్గవ సినిమాతో వెలిగిపోవాలి అనుకుంటున్నాడు.
రవితేజుడి ప్రకాశం తనపై పడితే బాగుండు అనుకుంటూ కధ కోసం
వెతుకుతున్నాడు. గతంలో రవితేజతో తీసిన.. ‘నీకోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్
శ్రీను’ సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో నాల్గవ
సినిమా ఇప్పుడు చేయాలి అనుకుంటున్నాడట.
అప్పట్లో ‘అందరివాడు’ సినిమాతో వైట్ల పని అయిపోయిందని అంతా అనుకుంటే ఢీ: సినిమాతో
మళ్ళీ అమాంతం పైకి లేచాడు. ‘ఇప్పుడు’ ఆగడు సినిమా విడుదల తర్వాత
కూడా అదే పరిస్థితి పునరావృత అయ్యింది.
తాజా ఫెయిల్యూర్ తో రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమా రద్దయింది కూడా. దీంతో
తనను తాను మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు రవితేజ అయితేనే
కరెక్ట్ అని డిసైడ్ అయ్యాడట. కామెడి, ఎంటర్ టైన్ మెంట్,
ట్విస్టులతో సినిమాలు చేసే శ్రీను..,
తనకు రవి అయతేనే బాగుంటుంది..,
బాడీ లాంగ్వేజ్ సూట్ అవుతుంది అనుకుంటున్నాడు.
మాస్ మహారాజాతో సినిమా చేస్తే.., హిట్ అవుతుంది అని గ్యారెంటిగా చెప్పలేము…
కాని పాస్ గ్యారంటి అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలము.
కాబట్టి మాస్, కామెడి ఫాలోయింగ్ ఉన్న రవితేజను శ్రీను సెలక్ట్ చేసుకున్నాడట.
ఈ సినిమాను కూడా 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తుందని సమాచారం.
‘ఆగడు’ సినిమాతో రూ.30కోట్లకు పైగా ముగ్గురి బ్యానర్
నష్టపోయింది. అయినా సరే వైట్లతోనే మరో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
Post a Comment