పవన్, మహేష్, ఎన్టీఆర్ తట్టుకోలేదు..చరణ్ వాళ్ళ అవుతుందా !
సినిమా ఇండస్ట్రీలో
నమ్మకాలు, సెంటిమెంట్స్
ఏ రేంజిలో ఫాలో అవుతుంటారో……..కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి నమ్మకాలు,
సెంటిమెంట్స్ కొన్ని సార్లు వారిని
తీవ్రంగా భయ పెడుతుంటాయి. తాజాగా ఇండస్ట్రీలోని యువ హీరోలను 8
అంకె
తీవ్రంగా భయపెడుతోంది. గతంలో పవన్
కళ్యాణ్, మహేష్
బాబు, జూ
ఎన్టీఆర్, అల్లు అర్జున్
విషయంలో 8 నెంబర్
తీవ్ర నష్టాలను మిగిల్చింది. నిన్నగాక మొన్న
విడుదలైన నాగ చైతన్య విషయంలోనూ ఇదే విషయం
రుజువయ్యేలా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో 8 నెంబర్‌కు నెక్ట్స్ టార్గెట్ కావబోతున్న
రామ్ చరణ్‌ను నష్టభయం వెంటాడుతోంది. ఇంతకీ ఈ 8 ఏమిటనుకుంటున్నారా?
8 అంటే ఆయా హీరోల కెరీర్లలో వచ్చిన 8వ సినిమా. పైన చెప్పిన స్టార్ హీరోల
కెరీర్లో 8వ
సినిమా ప్లాపు చిత్రాలుగా నిలిచాయి
1.పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కెరీర్లో వచ్చిన 8వ సినిమా ‘జానీ’. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో పెద్ద ప్లాపు
చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వం వహించారు.
2.మహేష్ బాబు మహేష్ బాబు కెరీర్లో వచ్చిన 8వ సినిమా ‘నిజం’. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా నష్టాలనే మిగిల్చిందని చెప్పక తప్పదు.
2.మహేష్ బాబు మహేష్ బాబు కెరీర్లో వచ్చిన 8వ సినిమా ‘నిజం’. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా నష్టాలనే మిగిల్చిందని చెప్పక తప్పదు.
3.జూ ఎన్టీఆర్ మరో
టాలీవుడ్ టాప్ హీరో జూ ఎన్టీఆర్ కెరీర్లో వచ్చిన 8వ సినిమా ‘ఆంధ్రావాలా’
పెద్ద ప్లాపయిన సంగతి తెలిసిందే. ఈ
చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు
4.అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 8వ సినిమా ‘వరుడు’ పెద్ద డిజాస్టర్. ఈచిత్రానికి గుణశేఖర్
దర్శకత్వం వహించారు.
5.నాగ చైతన్య ఇక
నాగ చైతన్య కెరీర్లో వచ్చిన 8వ సినిమా ‘ఆటో నగర్ నగర్’ సూర్య ఇటీవల విడుదలై నెగెటివ్ టాక్
తెచ్చుకుంది
భయ పడుతున్న
రామ్ చరణ్ ఇక రామ్ చరణ్ కెరీర్లో వస్తున్న 8వ సినిమా ‘గోవిందుడు అందరి వాడేలే’.
ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.
గత అనుభవాల దృష్ట్యా తన 8వ సినిమా విడుదలపై రామ్ చరణ్ కాస్త
భయం భయంగానే ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
మరి రామ్ చరణ్ ఈ సెంటిమెంటును అధిగమిస్తాడో?
తట్టుకోలేదు..చరణ్ వల్ల అవుతుందా!
తట్టుకోలేదు..చరణ్ వల్ల అవుతుందా!
Post a Comment