GuidePedia

0
నాగ్ తో తమన్నా రొమాన్స్?
నాగార్జునతో తమన్నా తొలిసారిగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కల్యాణ్ అనే న్యూడైరెక్టర్‌‌తో నెక్ట్స్ మూవీ చేస్తున్నట్లు ఇటీవల నాగార్జున ప్రకటన చేశాడు. ఇందులో ఈ హీరో డబుల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే రమ్యకృష్ణను ఓకే చేయగా.. మరో హీరోయిన్‌గా తమన్నాను తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయమై మిల్కీబ్యూటీతో నాగార్జున చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నాగార్జున - తమన్నాలు కలిసి ఇప్పటివరకు నటించ సినిమాల్లేవు. ఈ నేపథ్యంలోనే ఆమెని తీసుకోవాలని ఈ హీరో భావిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. సొంత బ్యానర్‌పై నాగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Post a Comment

 
Top