ఐ స్టొరీ లైన్ లీక్ చేసిన విక్రమ్ !!
భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరైన ప్రముఖ దర్శకుడు శంకర్ రూ. 180 కోట్ల బడ్జెట్‌తో చియాన్ విక్రమ్ హీరోగా తమిళంలో ‘ఐ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. అసలు ఈ సినిమా కాన్సెప్టు ఏమిటో ఎవరికీ అంతు పట్టడం లేదు. ఫస్ట్ లుక్ కూడా డిఫరెంటుగా ఉంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ ఖర్చు చేయించిన శంకర్ తెరపై ఏం అద్భుతం ఆవిష్కరించబోతున్నారనే విషయం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘ఐ' సినిమాలో మూడు గెటప్స్ లో కనపడతాను. సినిమా మోడలింగ్ ఫీల్డ్ కి సంబంధించిన పాయింటతో రూపొందింది. మోడలింగ్ రంగంలోకి వచ్చిన ఓ వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడనేదే కోణంలో సినిమా ఉంటుంది. శంకర్ స్టయిల్ లో సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్ కి ఫీలవుతారు అన్నారు.
Post a Comment