కారెక్టర్ లీకైంది - అల్లు అర్జున్ ని వెడ్డింగ్ ప్లానర్ గా మార్చేసాడు !!
త్రివిక్రమ్
డైరెక్షన్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఆ సినిమాకి
సంబంధించిన ఓ ఇంపార్టంట్ ఇష్యూ ఒకటి లీకైంది.
బన్నీ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని ఒకరు.. లేదు లేదు సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తాడని ఇంకొందరు.. ఇలా ఎవరికి తోచిన గాసిప్స్ వాళ్లు చెప్పుకున్నారు. దీంతో
అసలు అల్లు అర్జున్ ఎలా, ఏ గెటప్‌లో కనిపించనున్నాడా అనే ఆత్రుత అటు మెగా ఫ్యాన్స్ లో, ఇటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ లో అధికమైంది. ఈనేపథ్యంలో బన్నీ
పాత్ర లీకైందంటూ ఆన్‌లైన్‌లో కొన్ని వార్తలు హల్‌చల్
చేస్తున్నాయి. ఈ సినిమాలో బన్నీ ఓ వెడ్డింగ్ ప్లానర్‌గా కనిపించనున్నాడనేది ఆ
వార్తల సారాంశం. వెడ్డింగ్ ప్లానర్
క్యారెక్టర్‌కి త్రివిక్రమ్ తనదైన స్టైల్లో కామెడి అద్దాడని తెలుస్తోంది. స్వయంగా యూనిట్ వర్గాల ద్వారే ఈ విషయం బయటికొచ్చినట్లు సమాచారం. సమంత, అదాశర్మ, నిత్యామీనన్ లు
ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా
అప్పుడెప్పుడో 8 నెలల క్రితమే లాంచ్ అయినప్పటికీ షూటింగ్ మాత్రం ఈమధ్యే ఊపందుకుంది. ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలని నిర్మాత రాధాకృష్ణ భావిస్తున్నాడు. త్రివిక్రమ్ రెగ్యులర్ కంపోజర్
దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Post a Comment