నాగార్జునని సవాల్ చేసిన రిలియన్స్ అధినేత
రిలయన్స్ సంస్థల అధినేత అనీల్ అంబానీ దృష్టి
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున పై పడింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు
ఈరోజు ఉదయం అనీల్ అంబానీ ముంబాయిలోని చర్చ్ గేట్ స్టేషన్ బయట చీపురు పట్టి శుభ్రం
చేశారు. అనంతరం
అనీల్ అంబానీ ఈ ‘స్వచ్ఛ
భారత్’ కార్యక్రమంలో
పాల్గొనగలరా అంటూ పలువురు సెలెబ్రెటీలకు సవాల్ విసిరారు. ఈ లిస్టులో
మేరీ కోమ్, అమితాబ్
బచ్చన్, సానియా
మీర్జా, శోభా
డే, ప్రముఖ జర్నలిస్ట్
శేఖర్ గుప్తా, పాటల
రచయిత ప్రషన్ జోషి, హృతిక్
రోషన్ తో పాటు
టాలీవుడ్ హీరో నాగార్జునకు కూడా సవాల్ రావడం మీడియాకు హాట్ న్యూస్ గా మారింది.
నాగార్జున నటుడుగానే కాకుండా అనేక వ్యాపార సంస్థల
నిర్వహణలో అందెవేసిన
చేయిగా ఇప్పటికే పేరు సంపాధించుకోవడంతో అనీల్ అంబాని దృష్టి నాగార్జున పై
కూడా పడింది అనుకోవాలి. ఈరోజు ఉదయం ఈ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్న అనీల్ అంబానీ ఈ కార్యక్రమ
విజయం కోసం తాను అంకిత భావంతో పని చేస్తానని ప్రతిజ్ఞ చేయడమే కాకుండా ఇదే
అంకిత భావాన్ని అందరి దగ్గర ఆశిస్తున్నానని అంటూ నాగ్ కు సవాల్ విసిరారు.
అయితే అనీల్ అంబాని సవాల్ ను స్వీకరించి నాగార్జున మన భాగ్యనగరాన్ని
శుభ్రం చేసే కార్యక్రమం ఎప్పుడు చేపడతారో వేచి చూడాలి.

Post a Comment