GuidePedia

0

పబ్లిక్ లో అతనిని గెంటేసింది !!

బాలీవుడ్ నటి ప్రీతి జింతా థియేటర్ నుండి ఒక యువకుడిని బయటకు గెంటేయడం చర్చనీయాంశం అయింది. బ్యాంగ్ బ్యాంగ్' సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లో జాతీయ గీతం వేసారు. అయితే జాతీయ గీతం వస్తున్నపుడు ఓ యువకుడు లేచి నిలబడటానికి నిరాకరించడంతో కోపం వచ్చిన ప్రీతి జింతా అతన్ని బలవంతంగా బయటకు గెంటేసింది. ఈ విషయాన్ని ప్రీతి జింతా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే ప్రీతి జింతా చర్యపై ప్రశంసలతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ గీతాన్ని గౌరవించని వారికి ఇలాంటి జరుగాల్సిందే... ప్రీతి జింతా చేసింది కరెక్టే అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఆమె చర్యను తప్పుబడుతున్నారు.

Post a Comment

 
Top