చేకోడి రేటింగ్ : 3/5
చిత్రం : బ్యాంగ్ బ్యాంగ్!
బ్యానర్ : ఫాక్స్
స్టార్ ప్రొడక్షన్స్
సంగీతం : విశాల్-శేకర్
, సలీం సులేమాన్
ఛాయాగ్రహణం : వికాస్
శివరామన్, సునీల్ పటేల్
ఎడిటర్ : అకివ్ అలీ
రచన : సుభాష్ నాయర్
నిర్మాత : ఫాక్స్
స్టార్ స్టూడియోస్
దర్శకుడు : సిద్దార్థ్
ఆనంద్
నటినటులు : హృతిక్
రోషన్, కత్రినా
కైఫ్, డాని
డెన్ జోంగ్ పా జావీద్ జాఫ్రి, పవన్ మల్హోత్రా తదితరులు
హాలీవుడ్
చిత్రం టామ్ క్రుస్ నటించిన 'నైట్ అండ్ డే'కి రీమేక్ గా వచ్చిన చిత్రం 'బ్యాంగ్ బ్యాంగ్'. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా
డబ్ చేసి, ఒకేసారి విడుదల చేసారు. హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ చిత్ర టిజర్ తో సినిమాపై అంచనాలు పెంచేసాయి. హృతిక్ చేసిన
యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాపై ఆసక్తిని
కలిగించాయి. అత్యంత భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,500 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంటుందా? హాలీవుడ్ చిత్రాన్ని యథాతథంగా తీశారా? లేక ఇండియన్ ప్రేక్షకులకు అనుగుణంగా మార్చారా... ఆ విషయాల్లోకి వెళదాం...
కథ
: లండన్ లోని కోహినూర్ వజ్రాన్నిరాజ్ వీర్ (హృతిక్
రోషన్) దొంగిలిస్తాడు. కోహినూర్ వజ్రాన్ని
దక్కించుకునేందుకు రాజ్ వీర్ వెనుక మాఫియా డాన్ ఓమర్ జాఫర్ (డాని), హమీద్ గుల్
(జావెద్ జాఫ్రీ) ల గ్యాంగ్ వెంటాడుతుంది.
అయితే మాఫియా గ్యాంగ్ కు చిక్కకుండా ఓమర్ జాఫర్ ను ఎలాగైనా కలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఓమర్ జాఫర్ ను ఎందుకు కలుసుకోవాలనుకుంటాడు? మాఫియా ఛేజింగ్ లో రాజ్ వీర్ తో హర్లీన్ (కత్రినా కైఫ్) ఎందుకు కలిసింది? రాజ్ వీర్ కోహినూర్ ఎందుకు దొంగిలించాడు? చివరికి కోహినూర్
వజ్రం కథ ఏంటి అనే ప్రశ్నలకు సినిమా చూడాల్సిందే.
నటినటులు
: రాజ్ వీర్
గా హృతిక్ ఇండియన్ జేమ్స్ బాండ్ గా కనిపించాడు. 'సిక్స్ ప్యాక్' హృతిక్ యాక్షన్ సీన్లలో హాలీవుడ్ స్థాయి ఫెర్ఫార్మెన్స్ ను ప్రదర్శించాడు. ఇక ఈ చిత్రంలో అయితే 120 కార్లతో భారీ కార్ చేజింగ్, బోట్ ఫైట్స్, స్కై ప్లెయిన్ ఫైట్.. ఇలా రిస్కీ పోరాటాలు చేశాడు. హాలీవుడ్
చిత్రంలో టామ్ క్రూజ్ చేసిన పాత్రను ఈ చిత్రంలో
హృతిక్ చేశాడు. టామ్ క్రూజ్ నటనకు ఏ మాత్రం
తీసిపోని నటన కనబర్చాడు హృతిక్. ఫైట్స్ మాత్రమే కాదు.. ఓ పాటలో మైకేల్ జాక్సన్ స్టెప్పులతో అలరించాడు. యాక్షన్ సీన్లతోపాటు
కత్రినాతో హాట్ హాట్ గా రొమాన్స్ చేశాడు. యాక్షన్ హీరోగా హృతిక్ తన సత్తాను మరోసారి సినీ ప్రేక్షకులకు రుచి
చూపించాడు.
ధూమ్-3 చిత్రంలో
గ్లామర్ తో అదరగట్టేసిన కత్రినా 'బ్యాంగ్ బ్యాంగ్' లో ప్రదర్శించిన అందాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. హృతిక్ తో లిప్ లాక్, యాక్షన్, రొమాంటిక్ సీన్లలోనూ కత్రినా విజృంభించింది. పెద్గగా యాక్టింగ్ కు
స్కోప్ లేకపోవడం, గ్లామర్ తోనే కత్రినా సంతృప్తి పరిచింది. డానీ, జావేద్ జాఫ్రీల
విలనిజం గురించి పెద్దగా చెప్పుకునేంతగా ఏమి లేదు.
సాంకేతిక
వర్గం : విశాల్-శేఖర్ సంగీతం, సలీం సులేమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లకు జీవం పోశాయి. తూ మేరి, మెహర్ బాన్, బ్యాంగ్
బ్యాంగ్, ఉఫ్ పాటలు యువతకు జోష్ తోపాటు కిక్కెంచే విధంగా ఉన్నాయి. విశాల్-శేఖర్ అందించిన
బాణీలకు వికాస్ శివరామన్, సునీల్ పటేల్ ల సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణగా నిలిచింది. హలీవుడ్
సినిమాకి మక్కీకి మక్కీ తీయకుండా డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్ ఈ చిత్రాన్ని భారతీయ ప్రేక్షకులు అభిరుచి మేరకు మలచడం ప్లస్
పాయింట్. దర్శకునిగా తన కెరీర్ లో
చెప్పుకోదగ్గ చిత్రం అవుతుంది. 'ది అమేజింగ్ స్పైడర్ మేన్ 2'కి ఫైట్స్ సమకూర్చిన ఆండీ ఆర్మ్ స్ర్టాంగ్ 'బ్యాంగ్ బ్యాంగ్'కి సమకూర్చిన ఫైట్స్ సుపర్బ్. భారతీయ తెరపై ఇలాంటి యాక్షన్
సీన్స్ కనిపించడం ప్రేక్షకులకు ధ్రిల్ కలిగించే
విషయం.
ప్లస్ పాయింట్స్ :
·
యాక్షన్ సీన్స్
·
సినిమాటోగ్రఫీ
·
సంగీతం
డ్రా బాక్స్ :
·
కథ
చివరిగా
: 'నైట్ అండ్ డే' చిత్ర ఆధారంగా సిద్దార్థ్ ఆనంద్ 'బ్యాంగ్ బ్యాంగ్' ను రూపొందించారు. యాక్షన్, రొమాన్స్ ప్రధాన అంశాలుగా రూపొందిన ఈ చిత్రంలోని కథపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం ప్రధాన లోపంగా
మారింది. కేవలం స్క్రీన్ ప్లే ఆధారంగా ఓ ఛేజింగ్
లా సాగిన ఈ చిత్రం తొలి భాగంలో ట్రెడిషినల్
ఆడియన్స్ రోటిన్ గా అనిపించడమే కాకుండా, ప్రేక్షకులకు కొంత విసుగును
తెప్పిస్తుంది. అయితే చిత్ర రెండవ భాగంలో ఓ ట్విస్ట్ తో బ్యాంగ్ బ్యాంగ్ అనిపించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
చివర్లో కొంత సెంటిమెంట్ బ్యాంగ్ బ్యాంగ్
జోడించి ప్రేక్షకులతో ఓకే అనిపించుకోవడంలో సిద్దార్థ్ ఆనంద్ సఫలమయ్యారు. కేవలం యూత్ ను టార్గెట్ గా చేసుకుని నిర్మించిన ఈ చిత్ర విజయం కేవలం యాక్షన్, హృతిక్-కత్రినాల కెమిస్ట్రిపైనే ఆధారపడి ఉంటుంది. వంద కోట్ల క్లబ్ లో బ్యాంగ్ బ్యాంగ్
చేరడమనేది సాధారణ విషయమే.. అయితే యూత్, రెగ్యులర్ ఆడియెన్స్ ఆదరణ లభిస్తే 'బ్యాంగ్ బ్యాంగ్' భారీ కలెక్షన్లు కొల్లగొడుతుందనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. హృతిక్ రోషన్
నటన కోసం ఈ సినిమాని చూడాలి. అలాగే హృతిక్, క్రతినా మధ్య కెమిస్ర్టీ
కోసం చూడొచ్చు. సిద్ధార్ధ్
టేకింగ్ కోసం తప్పకుండా ఈ చిత్రాన్ని
వీక్షించాలి. థ్రిల్ కి గురి చేసే ఫైట్స్, మంచి రొమాంటిక్ సీన్స్, కామెడీ.. ఇలా సగటు ప్రేక్షకుడికి కావల్సిన అన్ని అంశాలూ
ఉన్న ఈ చిత్రం దసరా సెలవుల్లో ప్రేక్షకులకు
మంచి విందు.
Post a Comment