GuidePedia

0

ఆమెకు మూడ్ పోయిందట

అకస్మాతుగా వర్షం కురవడంతో నా ప్లాన్ అంతా పాడైపోయింది. దాంతో నా బాల్కనీ తలుపులపై బలప్రయోగం చేయవలసి వచ్చింది,అని ఇలియానా ట్విట్టర్లో పేర్కొన్నది. అసలు విషయం ఏమిటంటేఆ సాయంత్రం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో ఇలియానా వాకింగ్ వెళ్లాలని అనిపించిందట. హుషారుగా రెడీ అయిపోయి , ఇంటి బయటకు వచ్చింది. వెంటనే చిరుజల్లు మొదలయ్యింది . దానికి తోడూ బలమైన గాలి. మేడపై బాల్కనీలో తలుపులు తెరిచి ఉండడంతో ఇలియానా పైకి వెళ్లిందట.వాన చినుకులని , చల్లని గాలిని ఆస్వాదించాలని బాల్కనీకి వెళ్ళితే అక్కడ జరగకూడనిదే జరిగింది . గాలికి బాల్కనీ తలుపులు లాక్ పడిపోయాయట. ఇంట్లోకి రావాలంటే తాళం కావాలి . కానీ, అవి ఎక్కడున్నాయో ఇలియనాకి గుర్తు రాలేదు. కాసేపు బాల్కనీలో బంధిని అయిపోయాను అని చెప్పింది ఈ అమ్మడు. చివరకు తలుపులు బద్దలు కొట్టి , లోపలి వచ్చారట . ఆ మూడ్ అంతా పడిపోయింది. నేనొకటి తలిస్తే, విధి మరొకటి తలిచింది అంటూ ట్విట్టర్లో పేర్కొన్నది ఇలియానా.

Post a Comment

 
Top