GuidePedia

0

వర్మ 'శ్రీదేవి'తో ఈయన ఫీల్ అవుతున్నాడు !!

వర్మ కొత్త సినిమా పేరు వివాదాలకు కేంద్రబిందువుగా మారిపోయాడు. మొదట సావిత్రి అని పేరు పెట్టగా అప్పుడు కొన్ని ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. పురాణాల్లో పతివ్రతగా ప్రఖ్యాతి పొందిన సావిత్రి పేరుని ఇలాంటి B-గ్రేడ్ సినిమాకి వాడుకోవడం తగదు అంటూ ఆందోళనలు జరిగాయి. దాంతో అయన వెంటనే తన సినిమాకి సావిత్రి టైటిల్ తీసేసి శ్రీదేవి అని ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ టైటిల్ కి కూడా చికోచ్చిపడింది.
శ్రీదేవి అనే టైటిల్ తన భార్య పేరుని సూచిస్తుందని అంటూ అందాల తార శ్రీదేవి భర్త బోనీకపూర్ ఫీల్ అవుతున్నాడట. అంతేకాదు ఈ సినిమాకి తన భార్య పేరు పెట్టి ఆమె పరువు , ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నాడని వర్మపై కేసు కూడా పెట్టేందుకు సిద్దం అవుతున్నాడట. వర్మ మాములుగా చెబితే వినడని అనుకున్నాడో ఏమో కానీ అతడిపై చట్టబద్దంగానే పోరాడటానికి బోని కపూర్ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని ఇంతవరకు బోని ఎప్పుడు , ఎవరి వద్ద ప్రస్తావించిన దాఖలాలు మాత్రం లేవు.

Post a Comment

 
Top