మహేష్ బాబుతో అనగానే రెమ్యునరేషన్ పెంచేసాడు !!
'మిర్చి' ఫేమ్ కొరటాల
శివ దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు కొత్త సినిమాకు
పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్ మధి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న
సినిమాటోగ్రాఫర్‌గా వార్తల్లోకెక్కాడు. కోలీవుడ్‌కి చెందిన మధి గతంలో
మిర్చి సినిమాకి పనిచేశాడు. ఆ మూవీ బాగా రావడంతో ఇప్పుడు మహేష్
బాబు సినిమాకి కూడా కొరటాల శివ మళ్లీ ఆయన్నే తీసుకున్నాడు. దీంతో రేటు పెంచిన మధి ఈ
సినిమాకి ఏకంగా రూ.1.40
కోట్లు డిమాండ్ చేశాడు. మధి డిమాండ్ చేసినంత ఇవ్వడానికి చిత్ర నిర్మాత కూడా
అంగీకరించాడట. దీంతో ఇప్పటివరకు టాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకున్న
సినిమాటోగ్రాఫర్‌గా మధి రికార్డులకెక్కాడనేది ఫిలింనగర్ టాక్.

Post a Comment