దాని దెబ్బకి కరెంట్ తీగ వాయిదా పడింది
మనోజ్ హీరోగా, మంచు విష్ణు నిర్మాతగా నిర్మించిన సినిమా ‘కరెంట్ తీగ’. అన్ని
కార్యక్రమాలను
పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 17న భారీగా రిలీజ్ కావడానికి సిద్దమైంది.
కానీ హుదుద్ సైక్లోన్ రూపంలో సృష్టించిన ప్రళయం వలన కరెంట్ తీగ సినిమాని
వాయిదా వేసారు. గత రెండు రోజులుగా కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని హుదుద్
సైక్లోన్ అతలాకుతలం చేసింది. ఈ రోజు ఉదయానికి ఆ సైక్లోన్ తీవ్రత కాస్త
తగ్గింది. ఈ సైక్లోన్ వలన చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా ఈ చిత్ర టీం సినిమా రిలీజ్
ని వాయిదా వేసినట్లు తెలియజేశారు. అలాగే ఈ చిత్ర టీం మొత్తం వైజాగ్ వెళ్లి ఆక్కడ తమకు
చేతనైన సాయం చేయనున్నామని
మనోజ్ తెలిపాడు. మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా సన్నీ
లియోన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం
వహిస్తున్న ఈ సినిమాకి అచ్చు సంగీతం అందించాడు.

Post a Comment