GuidePedia

0

ఇలియానా మరీ ఇలానా !!

హాట్ బ్యూటీ ఇలియానా నటిస్తున్న కొత్త సినిమా హ్యాపీ ఎండింగ్’.  రొమాంటిక్ కామెడీగా రానున్న ఈ చిత్రా ట్రైలర్ గురువారం విడుదలైంది. ఈ మూవీలో ఈ గోవా బ్యూటీ అందాలు బాగానే ఆరబోసినట్టు కనిపిస్తోంది. సైఫ్‌తో రొమాన్స్ చేస్తూ చాలా సీన్లలో దర్శనమిచ్చింది. వీటిని చూసినవారు  మరీ ఇంతలా అందాలు ఆరబోయాలా అంటూ చర్చించుకుంటున్నారు. సినిమా ఎలా వుంటుందో తెలీదుగానీ.. రాబోయే రోజుల్లో మరిన్ని ఆఫర్లు ఈమెకు ఖాయమని అంటున్నారు. గతంలో వచ్చిన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రాలకు హ్యాపీ ఎండింగ్  తీసిపోదని అంటున్నారు. సైఫ్ - ఇల్లీ కెమిస్ర్టీ బాగానే వర్కవుటయ్యిందని యూనిట్ సభ్యులంటున్నారు. చాలా రోజుల తర్వాత గోవింద, ప్రీతిజింతా ఇందులో స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నారు. తెలుగువారైన రాజ్ నిడిమోరు- కృష్ణ డీకె డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నవంబర్  21న విడుదల కానుంది.

Post a Comment

 
Top