GuidePedia

0


నాగార్జునకి షాక్ ఇచ్చిన కాజల్

గోవిందుడు అందరివాడేలే సినిమా సక్సెస్ తో మంచి ఊపుమీదున్న కాజల్ ఈ సినిమా ప్రమోషన్ కు సంబందించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ కాజల్ రోజులు గడుపుతుంది. అయితే పలు చానల్స్ లో ఇస్తున్న ఇంటర్వ్యూ టాలీవుడ్లో తనకు నచ్చిన హీరో పేరు అందరిని ఆశ్చర్యపరిచింది. సామాన్యంగా ఇటువంటి ఇంటర్వ్యూల్లో పాల్గొనే హీరోయిన్స్ ఇటువంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు తెలివిగా ఓ బాలీవుడ్ హీరో పేరునో లేదా హాలీవుడ్ హీరో పేరునో చెప్పి తప్పించుకుంటారు. కానీ కాజల్ మాత్రం టాలీవుడ్లో తనకు నచ్చిన హీరోలు మాత్రం ఉన్నా తన అభిమాన హీరో ఎప్పటికీ నాగార్జున అంటూ అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ ఎవరు సీనియర్ హీరోలతో నటించాడని ఇష్టపడని ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జున తన అభిమాన హీరో కాజల్ అని బహిరంగంగా చెప్పడం బట్టి కాజల్ తెలివిగా సీనియర్ హీరోలతో కూడా నటించడానికి సిద్దమే అనే సంకేతాన్ని కాజల్ ఇస్తుందా? లేదంటే కేవలం అభిమానం వరకే ఈ విషయన్ని సరిపెడుతుందా ? అనే విషయాన్ని రానున్న రోజుల్లో తేల్చవచ్చు.
 

Post a Comment

 
Top