GuidePedia

0

ఎన్‌కౌంటర్‌ శంకర్ గా వస్తున్నా మహేష్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్‌కౌంటర్‌ శంకర్ గా రాబోతున్నాడు. ఇది అయన కొత్త సినిమా పేరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇది మహేష్ బాబు హీరోగా తాజాగా నటించిన ఫ్లాప్ సినిమా ఆగడుకి బాలీవుడ్లో పెట్టె పేరు. తెలుగులో ఈ సినిమా ఘోర పరజాయం అయిన విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు హిందీలోను కొంత మార్కెట్ ఉండడంతో ఆగడు సినిమాని బాలీవుడ్లో విడుదల చేయనున్నారు. సాదారణంగా సౌత్ హిట్ సినిమాల రైట్స్ కొనుగోలు చేసి తిరిగి హిందీలో రీమేక్ చేస్తుంటారు.ఇక ఆగడు ఫ్లాప్ కవద్మతో ఆ అవకాశం లేదని గ్రహించిన నిర్మాతలు హిందీలో ఈ సినిమాని డబ్ చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ డబ్బింగ్ హక్కులని ఫాన్సీ ధరకి రివాజ్ దుగ్గల్ సొంతం చేసుకున్నారు. ఇక ఆగడు సినిమాలో మహేష్ బాబు పాత్రా పేరు ఎన్కౌంటర్ శంకర్ పేరుని హిందీలో ఈ సినిమా టైటిల్ గా  నిర్ణయించారు. మరి బాలీవుడ్ లో మహేష్ సినిమాకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

 

Post a Comment

 
Top