GuidePedia

0

హవ్వ... ఆ ఇద్దరినీ రమ్మని పిలిచాడు

రాసలీలల స్వామి నిత్యానంద మళ్ళీ వార్తలకెక్కాడు. సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ నయనతారను ఈయన తన ఆశ్రమానికి ఆహ్వానించాడట. తన ప్రియ శిష్యురాలు రంజిత ద్వారాఈ కబురును ఆమెకు చేరవేశాడని అంటున్నారు. నువ్వు నీవాళ్ళు అనుకున్న వాళ్ళు, నీకు అత్యంత సన్నిహితులు నీకు దూరమయ్యారు. (శింబు, ప్రభుదేవ అనుకుందామా?) అందువల్ల నువ్వు కుమిలిపోతున్నావు.. దానినుంచి ఉపశమనం పొందాలంటే నా ఆశ్రమానికి వచ్చి సేద దీరు అని కబురుపంపాడట. అయితే నయనతర ఈ ఆహ్వానాన్ని తిరస్కరించిందని తెలిసింది. నయన్ వస్తే తనకు ఆశ్రమంలో తనకు తోడుగా ఉంటుందని రంజిత కూడా ఆశించిందని, కానీ ఆమె స్పందనతో నిరాశ చెందిందని సమాచారం. కోర్టు ఆదేశాలపై అధికారులు ఇటీవల స్వామి  నిత్యానందకు పొటెన్సీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, టీవీ, బాలీవుడ్ నటి శ్వేతా తివారీకి కూడా నిత్యానందుడు రాయబారం పంపినట్టు తెలిసింది. అయితే ఆమె రెస్పాన్స్ మాత్రం తెలియలేదు.

Post a Comment

 
Top