GuidePedia

0





చేకోడి రేటింగ్  :   3.25/5
చిత్రం  :  గోవిందుడు అందరివాడేలే
బ్యానర్  : పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
సంగీతం  : యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం  : సమీర్ రెడ్డి
ఎడిటర్  : నవీన్ నులి
రచన : పరుచూరి బ్రదర్స్
నిర్మాత  : బండ్ల గణేష్
రచన,దర్శకుడు  : కృష్ణవంశి   
నటినటులు  : రామ్ చరణ్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, కాజల్ అగర్వాల్, కమలిని ముఖర్జీ, జయసుధ, రహమాన్, కోట శ్రీనివాసరావు, ఆదర్శ్ తదితరులు
వరుసగా మాస్ సినిమాలు చేస్తూ విజయాలను అందుకున్న రామ్ చరణ్ ఈ సారి పంథా మర్చి పూర్తి కుటుంబ కథా చిత్రం గోవిందుడు అందరివాడేలే’. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. కాజల్ అగర్వాల్, శ్రీ కాంత్, ప్రకాష్ రాజ్, కమలినీ ముఖర్జీ, జయసుధ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని నిర్మాత బండ్ల గణేష్ నిర్మించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో కూడా హిట్ అందుకుంటానని నమ్మకంగా ఉన్న చరణ్ కి మరియు తెలుగు సినిమా చరిత్రలో పదికాలాల పాటు నిలిచిపోయేలా ఈ సినిమా ఉంటుందని నమ్ముతున్న కృష్ణవంశి, బండ్ల గణేష్ ల నమ్మకాన్ని నిలబెట్టేలా ఈ సినిమా ఉందా.? లేదా.? అనేది ఇప్పుడు చూద్దాం
కథ :  చిన్న తనం నుంచి లండన్ లోనే పెరిగిన హీరో అభిరామ్ (రామ్ చరణ్). ఓ రోజు తన తండ్రి ద్వారా తన కుటుంబ మూలాలను తెలుసుకుంటాడు అభిరాం. తన తండ్రి బాధని తీర్చి ఆ కుటుంబంలో తన కుటుంబాన్ని కలపాలని ఇండియా వస్తాడు . అలా వచ్చిన అభిరాం తన గ్రామం కోసం ఏమన్నా చేయాలనుకునే బాలరాజు (ప్రకాష్ రాజ్) కుటుంబంలోకి ఎంటర్ అవుతాడు . ఆలా చేరిన అభిరాం ఆ కుటుంబంలో నేను ఒకడిని అని చెప్పకుండా వారందరితో ఎలా కలసిపోయాడు? దానికోసం ఏమి చేశాడు ? చివరికి తను ఆ ఇంటి వారసుడే అని బాలరాజుకి తెలిసి ఎలా స్పందించాడు? అసలు అభిరాం తెలుసుకున తన తండ్రి గతం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.  సినిమా చూడాల్సిందే .

విశ్లేషణ :  రామ్ చరణ్ మొదటిసారిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో నటించాడు. ఇప్పటి వరకు మాస్ పాత్రల్లో నటించిన రామ్ చరణ్ . కానీ ఈ సినిమాతో అతని కెరీర్ రూపురేఖలు మార్చేస్తుంది. నటుడిగా చరణ్ ని ఓ స్థాయిలో నిలబెట్టే సినిమా అవుతుంది. రామ్ చరణ్ నటన చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోతారు. సినిమా మొత్తం కాక పోయిన అక్కడక్కడ తన నటనతో ఆకట్టుకుంటాడు.

శ్రీకాంత్ ఇందులో కాస్త నెగటివ్ పాత్రలో కనిపించాడు, నటన విషయాలో ఎలాంటి న్యాయం చేసాడు కానీ తనకి ఇచ్చిన పాత్ర ఎవరికీ అంతగా అర్ధం కాదు. ఇక ప్రకష్ రాజ్, జయసుధలకి చాలా రోజుల తర్వాత మంచి రోల్ దొరికింది సినిమా మొత్తం వీరి పాత్రలపైనే ఆధారపడింది. వీరు తమ అనుభవాన్ని మొత్తం ఈ సినిమాలో చూపించారు . ఈ సినిమాలో సరికొత్త ప్రకాష్ రాజ్ ని మనం చూడొచ్చు. 

ఇక కాజల్ నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. ఈమె నటనతో పాటు తన అందలతోను అలరించింది, కమలిని ముకర్జి తన పాత్రకి న్యాయం చేసింది. ఆదర్శ్ బాలకృష్ణ  నెగిటివ్ రోల్ చేశాడు. ఇక మిగితా నటులు తమ పాత్రల మేర చక్కగా నటించారు.

సాంకేతిక వర్గం : సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా పాటలు విన్నప్పుడు స్లో గా ఉన్నాయని అన్న వారు ఇప్పుడు తెరపై చూసి మరోసారి అదే బాట పట్టారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగున్నది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. రామ్ లక్ష్మణ్-పీటర్ హెయిన్ యాక్షన్ దృశ్యాలు బాగానే ఉన్నాయి. కృష్ణ వంశీ అచ్చ తెలుగు కథతో, మనసుని హత్తుకునేలా సినిమాని తెరకెక్కించాడు. నటీనటుల పూర్తి ప్రతిభని రాబట్టాడు. ఇక సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి , ఆర్ట్ డైరెక్టర్ అశోక్ ఊహలను అనుగుణంగా పనిచేశారు.

ప్లస్ పాయింట్స్ :
·        పాత్రల నటన
·        రామ్ చరణ్ - కాజల్ కెమిస్ట్రీ 
·        రచన 

డ్రా బాక్స్ :
·        రొటీన్ కథ 
·        క్లైమాక్స్ 

చివరిగా : ఈ పండుగ సీజన్ లో సూపర్ హిట్ టాక్ రాకపోయినా , మార్నింగ్ షో నుండి మాత్రం పాజిటివ్ టాక్ వినిపిస్తింది. పాత కథలకే కొత్త రంగులద్దరనే విమర్శలు వస్తున్నా పండుగ సీజన్ కాబట్టి ఆకట్టుకుంటుంది.  రామ్ చరణ్ , కాజల్ , ప్రకాష్ రాజ్ , శ్రీకాంత్ , కమలిని ముఖర్జీ , జయసుధ అందరూ అద్భుతమైన నటనని కనబరిచి , ఒకరితో ఒకరు మంచి కెమిస్ట్రీ పండించారు. కృష్ణ వంశీ చెప్పాలనుకున్న పాయింట్ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది . ఈ  సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు మంచి అవుట్ పుట్ కోసం కష్టపడ్డారని తెలుస్తుంది . ఒక్క మాట చెప్పాలంటే పాత సీసాలో కొత్త వైన్ పోసినట్లు ఉన్నది. గతంలో వచ్చిన సీతారామయ్య గారి మనువరాలు ‘ , ‘కలిసుందాం రా , ‘అత్తారింటికి దారేది’ వంటి సినిమాల కథాంశాలతో 2014 లో కృష్ణ వంశీ ఈ సినిమా చేశారు. ఈ సినిమా చూశాక ఈ విషయాన్ని మాస్ ప్రేక్షకులు అర్ధం చేసుకుంటారో లేదో చూడాలి .

Post a Comment

 
Top