GuidePedia

0


పుకార్లు పై వీరి సమాధానం దానితోనే  !!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాజాగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఈనేలాఖరున చూపించాలని అనుకుంటున్నాడు నిర్మాత బండ్ల గణేష్. పరిశ్రమల్లో ప్రస్తుతం ఉన్న ఒకరిద్దరూ భారీ నిర్మాతల్లో ఒకరిగా బండ్ల గణేష్ మిగిలారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ , పూరి సినిమాపై చాలా పుకార్లు వచ్చాయి.షూటింగ్ ఆగిపోయిందని , బండ్ల గణేష్ సినిమాని వదిలేశారని , పూరి టేకోవర్ చేశారని చెబుతున్నారు. వీటన్నిటికి చెక్ పెట్టడానికి ఒకేసారి సమాధానం చెప్పడానికి ఈనెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో అయిన ఫస్ట్ లుక్ విడుదల చేయాలనీ అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని జనవరి 9 న విడుదల చేసి తీరాలన్న కసితో ఉన్నాడు నిర్మాత బండ్ల గణేష్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నది.


Post a Comment

 
Top