GuidePedia

0


ఈ ‘లైలా కోసం’ తప్పుడు లెక్కలు చెప్పరా ?

అక్క్కినేని నాగచైతన్య తాజా చిత్రం  ఒక లైలా కోసంఈ వారం పోటీలో సినిమా లేకుండా థియేటర్స్‌ లోకి వచ్చేసింది. ఐతే ఈ సినిమా యూనిట్ ఇచ్చిన ప్రెస్‌నోట్ ప్రకారం ఫస్ట్ ‌డే కలెక్షన్స్ 5 కోట్ల అని ప్రెస్ కి విడుదల చేసింది అయితే ఈ  లెక్క తప్పు అని ట్రేడ్ వర్గాలు లెక్కలతో చెబుతున్నాయి. ఆలీ ఫ్ల్యాష్ బ్యాక్ కామెడీ తప్పించి ఎలాంటి న్యూ‌ఎలిమెంట్స్ లేని ఈ సినిమాని ఫీల్ గుడ్ ఫిల్మ్‌ గా అక్కినేని ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు. గుండె జారి గల్లంతయిందే డైరెక్టరే కాబట్టి ఆ సినిమాతో పోలిస్తే 20 శాతం కూడా ఆ స్థాయిలో లేదని విమర్శకులు చెబుతున్నారు. ఈ చిత్రానికి బాక్సాఫీస్‌లోవున్న సానుకూలాంశం పోటీ ఏ సినిమా లేకపోవడమే అని ట్రేడ్ టాక్. ఏరియాల వారీగా లైలా ఫస్ట్ డే అసలు వసూళ్లు ఇలా ఉన్నాయని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.


నైజాం-73 లక్షలు,
సీడెడ్ - 32 ,
ఉత్తరాంధ్ర-19,
గుంటూరు-18,
కృష్ణా-16,
ఈస్ట్ గోదావరి-14,
వెస్ట్ గోదావరి-13,
నెల్లూరు-9 లక్షలు 
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ 1. 94 కోట్లు. 

ఇక ఓవర్సీస్  రెస్ట్ ఆఫ్ ఇండియా -20 లక్షలు మాత్రమే వచ్చిందని అంటున్నారు. ఎలా చూసినా ఐదుకోట్లలో సగం కూడా రాలేదని లెక్కలు చెబుతున్నాయి. రాబోయేరోజుల్లో ఈ లైలాఇంకెన్ని లెక్కలు వెలువడుతాయో చూడాలి. 
 

Post a Comment

 
Top