GuidePedia

0


చేకోడి రేటింగ్  :   2.5/5
చిత్రం  :  ఒక లైలా కోసం
బ్యానర్  : అన్నపూర్ణ స్టూడియోస్
సంగీతం  : అనుప్ రూబెన్స్
ఛాయాగ్రహణం  : అండ్రు
ఎడిటర్  : ప్రవీణ్ పూడి
నిర్మాత  : అక్కినేని నాగార్జున
రచన,దర్శకుడు  : విజయ్ కుమార్ కొండ   
నటినటులు  : నాగ చైతన్య, పూజ హగ్దే, అలీ, సుమన్, షాయాజీ షిండే, సుధా, రోహిణి, శ్యామల, భరత్ రెడ్డి తదితరులు

ఈ ఏడాది మనంతో హిట్ కొట్టి, ఆటోనగర్ సూర్యతో డిజాస్టర్ ని చుసిన నాగ చైతన్య మరోసారి తనకు ఎంతో కలిసివచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ తో వచ్చాడు. గుండె జారి గల్లంతయిందే సినిమాతో డైరెక్టర్ గా నిరుపించుకున్న విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇప్పటి వరకూ తన కెరీర్లో రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో మంచి హిట్స్ అందుకున్న నాగ చైతన్య ఈ సినిమాతో మరో రొమాంటిక్ హిట్ అందుకున్నాడా.? లేదా ? అనేది ఇప్పుడు చూద్దాం...

కథ :  కార్తీక్ (నాగచైతన్య) పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో టాప్ ర్యాంకర్. చదువు పూర్తయిన తర్వాత పెద్ద కంపెనీల నుంచి ఉద్యోగాలను వచ్చిన ఆఫర్లను తిరస్కరించి.. ఓ ఏడాదిపాటు హాలీడే ట్రిప్‌కు కార్తీక్ వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే నందన(పూజా హెగ్డే)ను కార్తీక్ ప్రేమిస్తాడు. అయితే చిన్న చిన్న కారణాల వలన కార్తీక్‌ను నందన ద్వేషిస్తుంది. కాని నందన, కార్తీక్‌ల తల్లితండ్రులు వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటారు. తల్లితండ్రులను బాధపెట్టడం ఇష్టంలేని నందూ పెళ్లికి ఒప్పుకున్నప్పటికి.. కార్తీక్‌ను ద్వేషించడం మాత్రం మానదు. చివరికి కార్తీక్ ప్రేమకు నందన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? నందన మనసును కార్తీక్ ఎలా గెలుచుకున్నాడు, కార్తీక్‌ను ద్వేషించడానికి కారణాలు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెరమీద చూడాల్సిందే. 

నటినటులు : హీరోయిన్ ప్రేమ కోసం తపన పడే ప్రేమికుడిగా కార్తీక్ పాత్రలో నాగచైతన్య పర్వాలేదనిపించారు. ఫెర్ఫార్మెన్స్ విషయంలో గతంలో వచ్చిన సినిమాల కంటే కొంత మెరుగ్గా కనిపించినప్పటికి.. ఇంకా మెచ్యురిటీని సాధించాల్సిన అవసరం ఉంది. ఈ చిత్ర విజయ భారం మొత్తం నాగచైతన్య తన మీద వేసుకున్నారు. 

నందన పాత్రలో కనిపించిన పూజా హెగ్డే గ్లామర్‌తో ఆకట్టుకుంది. నందన పాత్రలో పెర్ఫార్మెన్స్‌ కు స్కోప్ ఉన్నప్పటికి.. ఆమెను దర్శకుడు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదనే అనిపించింది.

పాజిటివ్ కేరక్టర్ లో షయాజీ షిండే ఆకట్టుకున్నాడు. ఇంకా ఇతర పాత్రల్లో సుమన్, సుధ, రోహిణి, అలీ తదితరులు ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం : ఆండ్రూ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ఓ బ్యూటిఫుల్ మ్యాజిక్ అనే అనాలి. ప్రతి సీను అందంగా, కలర్ ఫుల్ గా ఉంది. ఆహ్లాదకరంగా ఉంది. అలాగే నాగచైతన్య, పూజా హెగ్డేలను గ్లామర్‌గా తెర మీద చూపించడంలో అండ్రూ సఫలయ్యాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అనూప్ రూబెన్స్ ఆకట్టుకున్నా.. పాటలు మాత్రం ఆలరించలేకపోయాయి. ఓ చెలి నువ్వే నా..బాగుంది. ఒక లైలా కోసం పాట తెరమీద ఆకట్టుకోలేకపోయింది... అలాగే ఎడిటర్ ప్రవీణ్ పుడి పూర్తి స్థాయిలో తన ప్రతిభకు పని పెట్టాల్సిందనే అభిప్రాయం కలుగుతుంది. తన మొదటి సినిమాకి హర్షవర్దన్ లాంటి రచయితల హెల్ప్ తీసుకున్న విజయ్ కుమార్ కొండ... ఈ సారి ఆ బాద్యతలు కూడా తనే తీసుకున్నాడు కానీ అయన అనుకున్న స్తాయిలో సక్సెస్ కాలేకపోయాడు. కథ రోటినే.. స్క్రీన్ ప్లే రోటినే... ఈ రెండిటిలో ఏదైనా బావుంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :
·        సినిమాటోగ్రఫీ
·        అక్కడక్కడ అలీ కామెడీ
·        ఫస్ట్ హాఫ్

డ్రా బాక్స్ :
·        రొటీన్ కథ, కథనం
·        సెకండ్ హాఫ్
·        పాటలు
·        దర్శకత్వం

చివరిగా :  ఏ సినిమా తీసుకున్నా.. ఫస్టాఫ్, సెకండాఫ్ అని విభజించి తమ అభిప్రాయాన్ని చెబుతుంటారు. అలా ఈ సినిమా ప్రథమార్థం, ద్వితీయార్థాన్ని తీసుకుంటే... సెకండాఫ్ కన్నా ఫస్టాఫ్ చాలా బాగుంది. ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చిందో తెలియనంత వేగంగా, సరదాగా సాగుతుంది. మధ్య మధ్యలో ఆలీ కామెడీ మెనేజ్ చేసేందుకు ప్రయత్నించారు. పూజా హెగ్డే ఇంట్రడక్షన్ సీన్ చిత్రీకరణ దర్శకుడి టేస్ట్ కు అద్దం పడుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో చెప్పుకోవడానికి ఒక్క సీన్ కూడా లేదు. కొన్ని ఫీల్ గుడ్ సన్నివేశాలను చిత్రీకరించడంలో దర్శకుడి నైపుణ్యం కనిపించింది. అయితే కథనంలో వేగం లేకపోవడం.. సాధారణ ప్రేక్షకుడు సైతం ఊహించగలిగే క్లైమాక్స్ ఉన్నప్పటికి.. ఓ మంచి ఫీల్‌తో ముగించలేకపోవడం లాంటి అంశాలు ప్రతికూలంగా మారాయి. స్టార్ఎపిసోడ్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఆతర్వాత అదే ఊపును దర్శకుడు కొనసాగించలేపోయారు. రొటిన్ కథ, రెగ్యులర్ కథనానికి డైలాగ్స్ కూడా బలంగా మారలేకపోయాయి. గుండె జారి గల్లంతైందేచిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు విజయ్‌కుమార్ పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేకపోయారని చెప్పవచ్చు.

Post a Comment

 
Top