యంగ్ డైరెక్టర్ తో ఆ హీరోయిన్ ఎఫైర్ !!
సినిమా నుంచి రాజకీయాలవైపు వెళ్లిన కన్నడ బ్యూటీ పూజా
గాంధీ. ఈ అమ్మడు అప్పట్లో దండు పాళ్యం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు
తెలిసింది. ఐతే ఇటీవలే సినిమా రంగానికి సంబంధం లేని ఓ వ్యక్తిని పెళ్లి
చేసుకొన్న ఈ భామ మరో దర్శకుడితో చాలా సన్నిహితంగా ఉంటోందట. తనకంటే
వయసులో నాలుగైదేళ్ళు చిన్నవాడైన దర్శకుడు సతీష్ ప్రధాన్ తో కారులో
లాంగ్ డ్రైవ్‌కి వెళ్లి రావడం ప్రస్తుతం శాండాల్వుడ్‌లో పెద్ద
చర్చనీయాంశమైంది. ఈ విషయం బయటకి ప్రచారం కాబడంతో ఆ ఇద్దరి మద్య ఏదో
సాగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కారులో ఇద్దరే లాంగ్ డ్రైవ్
వెళ్లొచ్చారు. పైగా చూడగానే రెండు ముఖాల్లో బాగా అలసట కనిపించిందిట. దాంతో ఈ
గుసగుసలకు ఆస్కారం వచ్చింది. ఐతే ఈ గుసగుసలు ఆనోటా ఈ నోటా పూజాగాంది చెవిన
పడటం తో స్పందించిన భామ అబ్బే అలాంటిదేం లేదు బెంగుళూర్ మొత్తం
చుట్టొచ్చాం అని చెప్పింది. కారు షికారు చాలా హుషారు నిచ్చిందని వివరణ
ఇచ్చింది. అలసిపోయినప్పుడు బడలిక తీరడానికి ఇలాంటి ప్రయాణాలు సహకరిస్తాయని
చెప్పింది. అదీ సంగతి.

Post a Comment