GuidePedia

0


బాహుబలి ప్రచారం కొత్తగా చేస్తారటా...!

సాధారణంగా రాజమౌళి సినిమాలకి ప్రత్యేకమైన ప్రమోషన్లు అవసరం లేదు కానీ బాహుబలి సినిమాని ప్రమోట్ చేసిన తీరు అందరికి గుర్తుంది. సినిమా షూటింగ్ లో ఎక్కువ సమయం తీసుకుంటుందని, ఆ సినిమాని చిత్రీకరిస్తున్న సమయంలో తీసిన మేకింగ్ వీడియోలను రాజమౌళి మొన్నటి వరకు ఒక్కొక్కటిగా విడుదల చేసారు. దానితో చాలా కాలం ఆ సినిమా గురించే అందరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ జక్కన్న హైదరాబాదులో కామిక్ కాన్పేరు మీద చిన్న పిల్లల కోసం జరుగుతున్న ఒక ఈవెంట్ తో రాజమౌళి తన బాహుబలి చిత్రాన్ని ప్రోమోట్ చేసుకునే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. బాహుబలి సినిమాకి సంబంధించి ఒక కామిక్ క్యారెక్టర్ ని ఈ కామిక్ కాన్ సృష్టించనుంది. దీంతో బాహుబలి ఇక చిన్న పిల్లలలో కూడా బాగా ప్రమోట్ అవనుంది.

Post a Comment

 
Top