GuidePedia

0

పవన్ కళ్యాణ్ పై షాకింగ్ సమాధానం ఇచ్చిన రాకుల్ ప్రీత్

గత కొన్ని రోజులుగా ఏ వెబ్ మీడియా చూసినా గబ్బర్ సింగ్ 2 హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక అయ్యిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో కొందరు ఆ వార్తలు నిజమని అనుకున్నారు. అయితే తనపై వస్తున్న వార్తలని చుసిన రకుల్ తనకు ఎదురైన మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ సమాధానం ఇచ్చిందని అంటున్నారు. ‘తానూ గబ్బర్ సింగ్ 2లో నటిస్తున్నట్లు మీడియాలో వార్తలు చూస్తున్నాని అయితే ఈ వార్తలు ఎవరు , ఎందుకు పుట్టించారో తెలియదు.కానీ , ఈ వార్త నిజం కావాలని కోరుకుంటున్నట్లు’ రకుల్ సమాధానం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే సందర్భంలో రకుల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో పవన్ కళ్యాణ్ తో నటించాలని ప్రతి హీరోయిన్ కి కోరిక ఉంటుంది. అలాగే తనకు కూడా ఆశ ఉన్నా, అవకాశం రావాలి కదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ అమ్మడు ఇచ్చిన సమాధానం బట్టి చుస్తే పవన్ గబ్బర్ సింగ్ 2 లో హీరోయిన్ ఎంపిక మరోసారి యు టర్న్ తీసుకున్నట్లు , తిరిగి అదే సస్పెన్స్ కొనసాగుతున్నట్లు అర్ధం అవుతుంది.

Post a Comment

 
Top