GuidePedia

0

సెక్స్ గురించి సంచలన వాక్యాలు చేసిన ఇలియానా !!

సాధారణంగా హీరోయిన్స్ సెక్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎందుకొచ్చిన గొడవలే అని తప్పుకుంటుంటారు. ఆ చర్చ ఎటొచ్చి ఎటు వెళ్తుందోనని భయపడుతుంటుంటారు. కానీ గోవా బ్యూటీ ఇలియానా మాత్రం పబ్లిగ్గానే సెక్స్ గురించి తెగ లెక్చరర్స్ ఇస్తోంది. సిగ్గు, మొహమాటం లాంటివేవీ లేకుండా సెక్స్ మనిషికి చాలా అవసరం అని చెప్పిందట గోవా బ్యూటీ. ఇటీవలే ఓ హెల్త్ మేగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇలియానా సెక్స్ గురించి చాలా విషయాలే చెప్పినట్లు తెలుస్తోంది. మంచి హెల్త్‌కి సెక్స్ చాలా అవసరం. సెక్స్ వల్ల ఫిట్‌గా వుంటారు. అంతేకాకుండా మంచి ఆకృతితోపాటు ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పిందట. శృంగారం వల్ల ఆరోగ్యం, ఫిట్‌నెస్ బాగుంటాయని గతంలో చాలామందే చెప్పారు కానీ ఈ ఉత్సాహం గురించి చెప్పినవాళ్లు మాత్రం తక్కువే అనుకోవాలని చెప్పడమే ఇప్పుడు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. సెక్స్ వల్ల వచ్చే ఉత్సాహం సంగతి ఈమెకెలా తెలుసనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Post a Comment

 
Top