'అతడి' తో పెట్టుకుంటే నిర్మాత గల్లంతే !!
సూపర్ స్టార్ మహేష్
బాబు టాలీవుడ్ టాప్ హీరో ఇతడితో పెట్టుకుంటే టాలీవుడ్ రికార్డ్స్ అన్నింటిని
బ్రేక్ చెయ్యగల కథానాయకుడు. కానీ ఇతడితో సినిమాలు తీసిన ప్రతి నిర్మాత దాదాపుగా
గల్లంతు అవుతున్నారు. ఈ మధ్యే వచ్చిన ‘ఆగడు’ విషయంలోనూ అదే జరిగింది ముగ్గురు
నిర్మాతలలో ఒక్కరు అమెరికాకి వెళ్ళిపోగా మిగితా వారి అడ్రస్ తెలియడం లేదు. ఆగడుకు
ముందు వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఈ సినిమా ముందు వరకి అన్ని భారీ
సినిమాలు చేసిన ‘దిల్’ రాజు ఈ సినిమా దెబ్బతో అన్ని చిన్న సినిమాలే చేస్తున్నాడు.
ఇక ‘బిజినెస్ మాన్’ ముందు వరకు వరుసగా సినిమాలే సినిమాలు చేసిన ఆర్ ఆర్ వెంకట్ (ఆర్
ఆర్ మూవీ మేకర్స్) ఈ సినిమాతో వారి బండికి బ్రేక్ పడింది. ఇంకా ‘ఖలేజా’ సినిమా
చేసిన సింగనమల రమేష్ తర్వాత స్కాంలో ఇరుకుపోయాడు. ‘అతిధి’ సినిమాతో టాలీవుడ్ కి
వచ్చిన యు టీవీ ప్రొడక్షన్స్ ఈ సినిమా తిరిగి పంపింది. ఇక ‘అతడు’ సినిమా థియేటర్స్
కంటే టీవిలో ఎక్కవగా ఆడుతుంది. ఈ సినిమాతో జయభేరి ఆర్ట్స్ సినిమాలు తియ్యడం
మానేసింది. ఇక తేజ ‘నిజం’ ముందు వారకి స్టార్ డం అనుభవించి తెలుగు సినిమాకి సూపర్
హిట్స్ ఇచ్చిన ఇతడు ‘అతడి’ దెబ్బ తట్టుకోలేకపోయడు. ఇవే కావు వీటికి ముందు వచ్చిన ‘బాబి’
‘మురారి’ సినిమాల నిర్మాతలు ఎవరోకుడా తెలియని పరిస్తితి. అందుకేనేమో ఎంతో మంది
స్టార్ ప్రొడ్యూసర్స్ ఉన్న ఇతడి కొత్త
సినిమా కొత్త నిర్మతలతో స్టార్ట్ అయ్యింది.
‘అతడి’
సినిమాలతో గల్లంతైనవారే కాక స్టార్ డం వచ్చిన వారు కూడా ఉన్నారు. ‘ఒక్కడు’
సినిమాతో ఎం యస్ రాజు ఓ స్తాయిలో నిల్చుంటే పోకిరి సినిమాతో పూరికి స్టార్ డం తో పటు డబ్బు వచ్చింది. అలాగే ‘దూకుడు’
నిర్మాతలని ఆ సినిమాతో పెద్ద నిర్మాతల లిస్టు లో చేర్చాడు.
Post a Comment