అత్తారింటికి దారేది చేసేది నేను కాదు !!
బాలీవుడ్ బాద్‌షా
షారుఖ్ ఖాన్ తెలుగు బ్లాక్‌బస్టర్ అత్తారింటికి దారేది మూవీ హిందీ రీమేక్‌పై కన్నేశాడని గతంలో కొన్ని
కథనాలొచ్చాయి. కానీ వాస్తవానికి అందులో
నిజం లేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పాడు. తాను 'అత్తారింటికి' రీమేక్ ప్లాన్‌లో
వున్నానని... అందుకోసం నిర్మాతల్ని కూడా సంప్రదిస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు షారుఖ్. అదంతా రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశాడు. సౌతిండియాలో హిట్ అయిన సినిమాల్ని బాలీవుడ్‌లో రీమేక్ చేసి
మళ్లీ అక్కడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఈమధ్య
పరిపాటి అయ్యింది. ప్రత్యేకించి తెలుగులో వచ్చిన సినిమాల్ని హిందీలో రీమేక్ చేయడం మరీ మామూలైంది. ఈ నేపథ్యంలో షారుఖ్ కూడా 'అత్తారింటికి' రీమేక్‌కి ఒప్పుకున్నాడని వార్తలొచ్చాయి. కానీ చివరకు షారుఖ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఇక ఆ పుకార్లకి ఫుల్‌స్టాప్ పడినట్లయింది.
Post a Comment