GuidePedia

0

ఇక అందాల డోస్ తగ్గిస్తుందట !!


శృతి హాసన్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే. ఎందుకంటే, ఇకపై అందాల ఆరబోత విషయంలో కాస్త ఆలోచించాల్సి వస్తుందని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. హిందీ సినిమాల్లోనూ, తెలుగు సినిమాల్లోనూ శృతి బాగా ఎక్స్ పోజ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కమలహాసన్ కూతురేమిటీ, ఆ ఎక్స్ పోజింగ్ ఏమిటీ? అన్న విమర్శలను కూడా ఈ చిన్నది ఎదుర్కుంది. అయితే, తమిళ సినిమాలకు వచ్చే సరికి శృతి అందాల ప్రదర్శన చేయడం లేదని ఆమె తమిళ అభిమానులు అలుగుతున్నారు. ఇదే విషయం ఈమధ్య ప్రస్తావనకు వస్తే, ఈ అమ్మడు కాస్త వివరంగా స్పందించింది. "నేను చేయాలని ఎక్స్ పోజింగ్ చేయడం లేదు. ఆయా సినిమాల్లో ఆయా పాత్రల ఔచిత్యాన్ని బట్టి నటిస్తున్నాను. అంతేకాని, తమిళ సినిమాలలో గ్లామరస్ గా కనిపించడం లేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఏమైనా, ఇక అన్ని భాషలలోను ఈ గ్లామర్ విషయంలో కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను" అని చెప్పింది.

Post a Comment

 
Top