GuidePedia

0

స్పెషల్ రిపోర్ట్ : అతడే 2014 టాప్ హీరో ?

టాలీవుడ్ సంబంధించి దసరా హడావిడి పూర్తి  అయింది. ఈ ఏడాది అత్యంత విజయవంతమైన చిత్రానికి వచ్చేసరికి మెగాస్టార్ ఫ్యామిలీకి చెందిన హీరోల మధ్యనే పోటీ నెలకొంది.  ప్రస్తుతానికి కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రానికి  పోటీగా వచ్చే ఏ భారీ సినిమా లేదు. అయినా ఈ మూవీ 2014 బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశంలేదని  సినీ పండితుల అంచనా.  2012 మరియు 2013లో టాలీవుడ్ ఇండస్ట్రికి టాప్‌ హిట్‌ని పవన్‌కళ్యాణ్‌ కైవసం చేసుకున్నారు.  2014లో ఆ రికార్డును మహేష్ లేదా ఎన్టీఆర్  బ్రేక్ చేస్తాడని అభిమానులు అనుకున్నారు.  ఎన్టీఆర్‌ రభస, మహేష్ బాబు 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలు కూడా ఫ్లాప్ అవడంతో వారికీ ఆ అవకాశం రాలేదు ఇక రామ్ చరణ్ కి  ఎదురు లేదని అందరూ అనుకున్నారు.

అయితే ఈ హీరోకి కూడా పరిస్థితులు అంత అనుకూలంగాలేవు.   పిల్లలకు సెలవులు అయిపోయాయి. జనం అంతా తమతమ పనులతో బిజీ అయిపోయారు. ఇరు రాష్ట్రాలలోని ధియేటర్లలో 'గోవిందుడు అందరివాడేలే'  చిత్రం కలెక్షన్స్  తగ్గుముఖం పట్టాయి. ఈ సంవత్సరం విడుదలయ్యే టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు ఇంక ఏమి లేవు. అందువల్ల  సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- శృతిహాసన్ జంటగా నటించిన  'రేసుగుర్రం' సినిమా 2014కు బిగ్గెస్ట్‌ హిట్‌‑గా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి 58 కోట్ల రూపాయల షేర్‌తో టాలీవుడ్ ఆల్‌ టైమ్‌ టాప్‌ హిట్స్ లో ఒక్కటిగా రేసుగుర్రం నిలిచింది. ఐతే ఇదే ఏడాది వచ్చిన నందమూరి బాలకృష్ణ  లెజెండ్ మూవీ సైతం 50 (అంచనా) కోట్ల రూపాయలతో రెండో ప్లేసులో ఉండగా, ఎవడు, మనం లాంటి సినిమాలు తరవాతి ప్లేసులో నిలిచాయి. ఇక ఎట్టి పరిస్థితులలో రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' మూవీ ఈ  స్థాయిని అందుకోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

'గోవిందుడు అందరివాడేలే' చిత్రం మొత్తం వసూళ్లు 35-40 కోట్ల రూపాయలకు  మించే అవకాశం లేదని అంటున్నారు. అందువల్ల కూడా  2014లో వసూళ్ల విషయంలో టాప్ హీరోగా అల్లు అర్జున్ నిలవడం ఖాయం అని ఫిల్మ్‌నగర్‌ టాక్.  మహేష్ బాబుకు రామ్ చరణ్  షాక్ ఇస్తే, ఇప్పుడు అనుకోకుండా  ఏకంగా  చరణ్-కే షాక్ ఇచ్చి 2014 టాప్ హీరోగా అల్లు అర్జున్  సెటిలయ్యాడు.. కొద్దిరోజులు ఆగితే ఎవరు ఎవరికి షాకిస్తారో తేలిపోతుంది.

Post a Comment

 
Top