GuidePedia

0


ఆగడుపై మరో వార్త : ఆ సాంగ్ తమన్ చేయలేదటా !!

సాధారణంగా, ఏదైనా కొత్త సినిమా సూపర్ హిట్ అయితేనో, బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తానో ఆ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు, విశేషాలు బయటకు తెలుస్తుంటాయి. కానీ మహేశ్ బాబు నటించిన 'ఆగడు' సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, ఆ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటీవలే ఆ సినిమా గురించి రాంగోపాల్ వర్మ వివాదస్పద కామెంట్లు, ప్రకాష్ రాజ్-శ్రీనువైట్లల గొడవ, నిర్మాతల మధ్య మనస్పర్థలు... ఇలా ఈ చిత్రంపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. తాజాగా, 'ఆగడు' సినిమాకు సంబందించి మరో పుకారు ఫిలింనగర్ లో షికారు చేస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రంలో శృతిహాసన్ పాడి ఆడిన 'జంక్షన్' సాంగ్ కు ట్యూన్ తమన్ ఇవ్వలేదని ఫిలింనగర్ సమాచారం. టాలీవుడ్ అప్ కమింగ్ మ్యూజిక్ డైరక్టర్ గా ఎదుగుతున్న భీమ్స్ ఈ పాటకు ట్యూన్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ ట్యూన్ బాగా నచ్చడంతో, భీమ్స్ కు మంచి అమౌంట్ పే చేసి నిర్మాతలు దానిని తీసుకున్నారట! అయితే, డబ్బులిచ్చినప్పటికీ సీడీ కవర్ మీద ఆ పాట క్రెడిట్ భీమ్స్ కు ఇచ్చి వుంటే బావుండేదని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Post a Comment

 
Top