GuidePedia

0

ప్రభాస్ తర్వాతి సినిమా సుజీత్ తో ??

బాహుబలితర్వాత ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ ఏంటి..? ఏ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడు..? ఇలా అనేక ప్రశ్నలు ఆయన అభిమానులను వెంటాడుతున్నాయి. తాజాగా అందుకున్న సమాచారం మేరకు యువ డైరెక్టర్ సుజిత్‌తో ప్రభాస్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. రన్ రాజా రన్' ద్వారా దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు సుజిత్. ఇటీవల ఈ హీరోని సంప్రదించిన తన దగ్గరున్న ఓ స్టోరీని వినిపించాడట. పూర్తి చేసి మరోసారి కలవాలని హీరో చెప్పినట్టు ఇన్‌సైడ్ సమాచారం. అదేపనిలో ఈ యంగ్ డైరెక్టర్ నిమగ్నమయ్యాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మిర్చి బ్యానర్‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్లడం ఖాయమట. అన్నట్లు..  ప్రభాస్‌కి ఈ దర్శకుడు దగ్గరి బంధువేనట.

Post a Comment

 
Top