GuidePedia

0

జీవిత రాజశేఖర్ కి రెండేళ్ళ జైలు శిక్ష !!

సినీ నటి జీవితకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు షాకిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆమెకు రూ.25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తన భర్త రాజశేఖర్ నటించిన 'ఎవడైతే నాకేంటి' సినిమా రైట్స్ కోసం నిర్మాత శేఖర్ రెడ్డికి జీవిత రూ. 22 లక్షల చెక్కును ఇచ్చారు. చెక్ బౌన్స్ కావడంతో డబ్బును ఇవ్వాల్సిందిగా జీవితను శేఖర్ రెడ్డి ఎన్నోసార్లు కోరారు. అయినప్పటికీ, జీవిత నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శేఖర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అయితే, రూ. 25 లక్షల రూపాయలను కోర్టులో జమచేసి... హైకోర్టుకు అప్పీలు చేసుకునే ఆలోచనలో జీవిత ఉన్నట్టు సమాచారం.


Post a Comment

 
Top