GuidePedia

0


జూ ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్న టాప్ హీరోస్ !!

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు ఇటీవల కాలంలో వరుసగా ప్లాప్ అవుతుండడంతో తెలుగు సినీ పరిశ్రమ మరోసారి సంక్షోభంలో పడింది. దీంతో, భారీ మొత్తాలు వెచ్చించి సినిమా హక్కుల్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాల్ని చవిచూశారు. దీంతో వారు నిర్మాతల్ని తమ డబ్బు వాపసు చేయమని ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపధ్యంలో, పరిశ్రమ మళ్లీ గాడిలో పడే వరకు అగ్రహీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని నిర్మాతల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం, టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాకు 12 నుంచి 20 కోట్ల వరకు తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్, మహేశ్ బాబులు 20 కోట్లకు పైగానే వసూలు చేస్తున్నట్లు సమాచారం. నిర్మాతల ప్రతిపాదనకు టాలీవుడ్ అగ్రహీరోలు కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రానికి ఎన్టీఆర్ తన రెమ్యూనరేషన్ ను 20 శాతం తగ్గించుకున్నాడని సమాచారం.

Post a Comment

 
Top