మహేష్ - కొరటాల శివ సినిమా నుండి శృతి అవుట్ ??
మహేష్‌బాబు
సినిమా గురించి ఓ వార్త వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మహేష్‌బాబు - శృతిహాసన్ జంటగా కొరటాల శివ డైరెక్షన్‌లో మూవీ
చిత్రీకరణ జరుగుతోంది. ఐతే, ఈ ప్రాజెక్ట్ నుంచి శృతిహాసన్ డ్రాప్ కావడంతో షూటింగ్ ఆగినట్టు తెలుస్తోంది. శృతి ప్లేస్‌లో సమంతను ఎంపిక చేసే
ఛాన్స్ వుందని వార్తలు వెలువడుతున్నాయి. రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ పూణెలో ప్రారంభమైంది. ఇక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని తమిళంలో విజయ్ లేటెస్ట్ ఫిల్మ్‌కు ఈ బ్యూటీ
హాజరవుతోంది. ఇందులోభాగంగానే ప్రిన్స్
చిత్రానికి సంబంధించి ఈ బ్యూటీ కాల్షీట్లు ఇవ్వలేదని అంటున్నారు. దీనివల్ల షూటింగ్‌కు అంతరాయం జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. ఒక్కోసారి ఈమెకు ఫ్లయిట్ దొరక్క.. అనుకున్న
సమయానికి షూట్ జరగలేదని యూనిట్ సభ్యులు
చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఓ సాంగ్ సగం వరకు షూటింగ్ అయినట్టు తెలుస్తోంది. శృతి తప్పుకున్నట్లు వస్తున్న ఈ గాసిప్స్‌లో నిజమెంత అనేది తెలియాల్సివుంది.
Post a Comment