GuidePedia

మహేష్ - రజిని ఇద్దరు కలసి సినిమానా ??

ప్రిన్స్ మహేష్ బాబు, సూపర్ స్టార్ రజినీకాంత్ ఇద్దరు కలసి నటిస్తే ఎలా ఉంటుంది.. ఆ సినిమా కోసం అభిమానుల వచ్చే ప్రవాహం సునామీలా ఉంటుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇదే కాంబినేషన్ త్వరలోనే తెరపై కనిపించనుంది. ఇక అసలు విషయంలోకి వెళితే మహేష్ బాబు తన తదుపరి సినిమా శ్రీ కాంత్ అడ్డాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. పివిపి నిర్మించనున్న ఈ సినిమాకి బ్రహ్మోత్సవంఅనే టైటిల్ ని ఖరారు చేసారు. కథానుసారం ఈ సినిమాలో పెదరాయుడు లాంటి పాత్ర ఒకటి ఉంది. ఆ పాత్రకి రజినీకాంత్ అయితేనే పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే శ్రీకాంత్ అడ్డాల పివిపి ఈ వారం చివర్లో రజినీకాంత్ ని కలిసి కథ వినిపించనున్నారు. రజినీకాంత్ కథ విని ఓకే చేస్తే ఇద్దరు సూపర్ స్టార్స్ ని ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకి రావడమే కాకుండా మరో క్రేజీ అండ్ మోస్ట్ వాంటెడ్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది.

 
Top