టాలీవుడ్ పై దండయాత్ర మొదలు పెట్టిన ధనుష్ !!
ఎన్నో
సంవత్సరాలుగా తెలుగులో బ్రేక్ కోసం చూస్తున్న ధనుష్ కి రఘువరన్ బిటెక్ చిత్రం మంచి
విజయం సాధించిపెట్టడమే కాకుండా ఆ చిత్రాన్ని రిలీజ్ చేసిన నిర్మాతకు మంచి లాభాలు తీసుకువచ్చింది. దీనితో
ఇక వరుసగా ధనుష్ సినిమాలు తెలుగు తెరపై
దాడికి సిద్దమయ్యాయి. ఆ కోవలో భాగంగానే తమిళంలో ఎప్పుడో విడుదల అయిన సినిమాలు ఈ
మధ్య పందెం కోళ్ళు, మరియాన్ లుగా వస్తున్నాయి. పందెం కోళ్ళు అనే సినిమా వచ్చింది
పోయింది కుడా ఎవరికీ తెలియదు అనుకోండి. ఇంకా ఈ సినిమాలతో పాటు రెగ్యులర్ సినిమా
అనేగాన్ సినిమా అనేకుడుగా తెలుగులో వస్తుం.ది ఈ సినిమా అక్కడ ఈ రోజు విడుదల అయితే ఈనెల 20న అనేకుడు తెలుగునాట రిలీజ్ కానుంది. మరి చూద్దాం ఈ మరియాన్,
అనేకుడు సినిమాలు రఘువరన్ బిటెక్ ల లాభాలు తిసుకువస్తుందో లేదా పందెం కోళ్ళు లాగా వచ్చిన
దారినే పోతాయో చూడాలి.
Post a Comment