బూత్ షో పై FIR ఫైల్ అయ్యింది !!
ఆల్ ఇండియా బ్యాక్ చోడ్ (AIB) అనే యూట్యూబ్ ఛానల్ చేసిన
రోస్ట్ అనే ప్రోగ్రాం రచ్చ మనకు తెలిసిందే. కామెడీ పేరు చెప్పి మన దేశంలో ఎక్కడ లేని
ఈ బూతు కామెడీ వలన భారత దేశ సంప్రదాయం మంట కలిసింది అంటూ లక్నో కు చెందిన
కైలాష్ చంద్ర పాండే కేసు పెట్టడంతో ఎఫ్.ఐ.ఆర్ ను కూడా నమోదు చేసారు
పోలీసులు.ఇక ఆ పోలీసులు వెంటనే కేసును పెట్టేసారు. పబ్లిక్ లో బూతులు
మాట్లాడినందుకు ఐపీసీ 294
,యూట్యూబ్ ద్వారా బూతు సందేశం ఇచ్చినందుకు ఐటి సెక్షన్ 66,ఇంకో
రెండుమూడు సెక్షన్లు కలుపుకొని హీరోలు అర్జున్ కపూర్,రన్వీర్ సింగ్,అలాగే నిర్మాత కరణ్ జోహార్ పై కేసును నమోదు చేసారు.యూపీ
పోలీసులు రాష్ట్రీయ శహరి వికాస్ సమతికి చెందిన కైలాస్ తన 9 ఏళ్ల కొడుకు
సెల్ఫోన్ లో ఈ రోస్ట్ విడియోను చూస్తుండటంగమనించి తాను కూడా చూసాడట. అది
చూసి చలించిపోయి ఇలా కేసు పెట్టాడట ఇంకా అయన సన్నీ లియోన్ లాంటి పోర్న్ స్టార్
మంచిగా మరి సినిమాలు చేస్తుంటే మన వాళ్ళు ఇలాంటి ఓ బూతు షో చెయ్యడం చాలా
దురదుష్టకరమని అని అన్నారు.
Post a Comment