GuidePedia

0

బుర్రిపాలెంని దత్తత తిసుకోబోతున్న మహేష్ !!

గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం అనే గ్రామాన్ని సూపర్ స్టార్ మహేష్‌బాబు త్వరలో దత్తత తీసుకోనున్నట్టు గుంటూరు ఎంపీ, మహేష్ బావ అయిన జయదేవ్ గల్లా మీడియాకు తెలిపారు. బుర్రిపాలెం జెడ్పీ హైస్కూలు ఆవరణలో సర్వశిక్షా అభియాన్ నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు జయదేవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ బుర్రిపాలెంను దత్తత తీసుకుని స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దాలని ఎన్నికలకు ముందే అనుకున్నామని చెప్పారు. కానీ ప్రజా ప్రతినిధులు తమ స్వగ్రామం, ఆత్తగారి ఊర్లను దత్తత తీసుకోకూడదన్న నిబంధనలు ఉండడంతో కుదరలేదన్నారు. అయితే తన భార్య, సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె పద్మ తెనాలి మండలం కంచర్లపాలెంను, తన బావమరిది అతని స్వగ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకోనున్నారని జయదేవ్ తెలిపారు.

Post a Comment

 
Top