GuidePedia

0

ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్న నాగ చైతన్య !!

నాగచైతన్య ఇండస్ట్రీ కి వచ్చి చాలా రోజులు అవుతుంది…. అయినా తనకంటూ ఓ ఇమేజ్ సెట్ చేసుకోలేకపోయాడు. చైతు ఇప్పుడు తన కెరీర్ ని ఆచితూచి ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నాడు. తన కెరీర్ కి హెల్ప్ అయ్యే విధంగా మంచి సినిమాలని రూపొందించే దర్శకుల వెంటపడుతున్నట్లు సమాచారం. ఇటీవల తమ మొదటి సినిమాలతో హిట్ అందుకున్న దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. గుండెజారి గల్లన్తయ్యిందే దర్శకుడు విజయ్ కుమార్ తో ఇప్పటికే నాగచైతన్య ఒక లైలా కోసం చేసి ఫరవాలేదు అనిపించుకున్నాడు. ప్రస్తుతం స్వామి రారా డైరెక్టర్  సుధీర్ వర్మ దర్శకత్వంలో దోచేయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతుంది. ఇదిలా ఉంటె….తాజాగా నాగచైతన్య జాబితాలో మరో దర్శకుడు చేరిపోయాడు. కార్తికేయ వంటి హిట్ సినిమా ఇచ్చిన చందు మొండేటి తో సినిమా చేసేందుకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. చందు చెప్పిన కథ నచ్చడంతో అతనితో పనిచేసేందుకు ఒప్పుకున్నాడు. మొన్నటి వారకి జూ ఎన్టీఆర్ కూడా ఇదే విధానాన్ని ఫాలో అయ్యీ ఘోరమైన దెబ్బ తిన్నాడు ఇక లాభం లేదని ఫ్లాప్ లలో ఉన్న దర్శకుడికే కసి ఉంటుందని తెలుసుకొని ఇక వారితో చెయ్యడం మొదలుపెట్టాడు. ఇక చైతు పరిస్థితి ఎన్టీఆర్ ల మారుతుందో లేక ఆ డైరెక్టర్స్ చేత మరో హిట్ రప్పించుకుంటడో చూడాలి.

Post a Comment

 
Top