GuidePedia

0

మొత్తానికి 'గోపాల గోపాల'ని ఫ్లాప్ చేసారు !!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న వెంకటేష్‌ ,పనవ్‌ కల్యాణ్ లు నటించిన గోపాల గోపాల సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. డాలీ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ చివరకు ఫ్లాప్‌ మూవీగా మిగిలింది. బిజినెస్‌ ముగిసే సమయానికి గోపాల గోపాల సినిమా రూ.40+ కోట్లను అందుకుందట. ఈ సినిమా అన్ని ఏరియాల థియేటరికల్‌ రైట్స్‌ రూ. 46 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో దాదాపు రూ. 6కోట్ల వరకు నష్టం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల డిస్టిబ్యూటర్లు, బయ్యర్లు గట్టెక్కితే మరికొన్ని చోట్ల నిండా మునిగిపోయారు. ఏది ఏమైనా పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ లకు ఈ ఏడాది ఫ్లాప్‌ తో ప్రారంభమైందని టాలీవుడ్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కోలీవుడ్‌ డైరక్టర్‌ శంకర్‌ , విక్రమ్‌ ల కాంబినేషన్లో వచ్చిన సినిమాకి తమిళంలో మంచి టాకే వచ్చిన కూడా తెలుగు నాట ఫ్లాప్‌ సినిమాగానే మిగిలింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 28.89 కోట్లను వసూలు చేసిందని వినిపిస్తుంది. అయితే తెలుగు హక్కులను సూపర్ గుడ్ సంస్థ ఈ సినిమా రూ.30 కోట్లకు కోనుగోలు చేశారట. ఈ లెక్కలు చూసుకుంటే నిర్మాతలకు దాదాపు రూ.2 కోట్లవరకు బొక్క పడిందని టాక్. అటు డిస్టిబ్యూటర్లు, బయ్యర్లు కూడా బాగానే నష్టపోయారట. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు హిట్టవుతాయనే నమ్మకంతో భారీ బడ్జెట్‌ తో తీసిన ఈసినిమాలు బాక్సీఫీసు దగ్గర ఢమాల్‌ మన్నాయి, జనవరి నుండి ఈ రోజు వరకు రిలీజ్ అయిన గడ్డం గ్యాంగ్,పెసరట్టు మూవీ వరకు అన్ని ఫ్లాప్ మూవీస్ గానే మిగిలిపోయాయి. ఇక కళ్యాణ్ రామ్ పటాస్’ అన్ని వర్గాల నుంచి హిట్ సినిమాగా అనిపించుకుంటే, నిన్న వచ్చిన శర్వానంద్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాకి ఎ క్లాసు జనాల నుంచి మంచి హిట్ టాక్ వినిపిస్తుంది... మరి వచ్చే వారం వస్తున్నా ఎన్టీఆర్  టెంపర్ పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి.

Post a Comment

 
Top