ఆఫర్లు రానప్పుడే నా పెళ్లి !!
ప్రస్తుతం పెళ్లి వయస్సు దాటిన స్టార్ హీరోయిన్లు
సైతం పెళ్లిళ్లు చేసుకుని సెటిలైపోతుంటే..
తనకు మాత్రం పెళ్లికి ఇంకా టైముందంటూ దీర్ఘాలు పలుకుతోంది బొద్దుగుమ్మ
నమిత! నిజానికి ఇప్పటివరకు పెళ్లిళ్లు చేసుకున్న తారలందరికీ మూవీ
ఆఫర్లు సరిగ్గా రాకపోవడం వల్ల ఇండస్ట్రీలో తమ టైం అయిపోయిందని భావించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అందులోనూ వారందరూ ఒకప్పుడు
ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన వాళ్లే! కానీ.. అడపాదడపా
చిన్నమూవీలు చేసుకుంటూ ఎప్పుడో తెరమీద కనిపించే
నమిత మాత్రం.. తన చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయని, అందుకే ఇంకా పెళ్లికి టైముందంటుంది. ఎప్పుడూతే
తనకు సినిమా ఆఫర్లు రావడం ఆగిపోతాయో..
అప్పుడే తాను ఇండస్ట్రీ నుంచి పక్కకు తప్పుకుని రియల్ లైఫ్ సెటిలవుతానంటోంది
నమిత! ఈ నేపథ్యంలో అమ్మడు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నేను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో
వరుసగా సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా వున్నాను.
ఇలాగే మూవీ ఆఫర్లు వచ్చినంతకాలం చేస్తూనే వుంటాను. ఎప్పుడైతే ఆఫర్లు
రావడం మానేస్తాయో.. అప్పుడు చిత్రపరిశ్రమ నుంచి తప్పుకుని, తనను ప్రేమించే మంచి వ్యక్తితో పెళ్లి
చేసుకుని సెటిల్ అవుతా’’నంటోంది ఈ భారీ అందాల
బొద్దుగుమ్మ!
Post a Comment