GuidePedia

0

బాబు ఎఫెక్ట్ : పవన్ పక్క ప్లానింగ్

పవన్ కళ్యాణ్ ఓ కొత్త  సినిమా కమిట్ అయ్యే ముందు తన పారితోషికం విషయంలో చాలా ప్లానింగ్ గా ఉంటున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇలా చెప్పుకోవడానికి ఓ కారణం కూడా ఉంది. వెంకటేష్ తో కలిసి పవనకళ్యాణ్ నటించిన 'గోపాల గోపాల' చిత్రం పవన్ కి బాగానే లాభాలు తెచ్చి పెట్టింది. సురేష్ బాబు తన తెలివితో ఈ సినిమాని కేవలం 10కోట్లతో రూపొందించాడని సమాచారం. ఈ సినిమాకి తను పారితోషికం తీసుకోకుండా, లాభాల్లో వాటా తీసుకున్నారు వెంకటేష్,  పవన్ కళ్యాణ్. ఇందులో బాగంగా పవన్ కి దాదాపు 20కోట్లు దాకా దక్కిందని సమాచారమ్. తాజాగా 'గబ్బర్ సింగ్ 2' చిత్రానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి పక్కా ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి కూడా పవన్ కళ్యాణ్ పారితోషికం తీసుకోవడంలేదట. పైగా 20కోట్ల బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని పూర్తి చేద్దామని చెప్పేసాడట పవన్ కళ్యాణ్. 20 కోట్ల బడ్జెట్ తో సినిమా పూర్తియిపోతే, శాటిటైల్ రైట్స్,  ఏరియాలు, ఓవర్ సీస్ మొత్తం కలిపి దాదాపు 50 నుండి 60 కోట్లు వచ్చే అవకాశముంది. 20కోట్లు బడ్జెట్ పోతే, మరో 30 - 40కోట్లు శరత్ మరార్, పవన్ కళ్యాణ్ పంచుకోవాలని ప్లాన్ చేసారట. సో... దీన్ని బట్టి, పవన్ ఓ సినిమా చేస్తే, కనీసం 20కోట్లు గిట్టుబాటయ్యేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడని అర్ధం చేసుకోవచ్చు. 

Post a Comment

 
Top