ఆ విధంగా చుస్తే 'టెంపెర్' బ్లాక్ బస్టర్ హిట్ !!
గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేక వరుస ఫ్లాప్ లతో
సతమతమౌతున్న ఎన్టీఆర్ కు టెంపర్
అంటే ఏంటో తెలిసోచ్చినట్లుంది. ఇక ఎన్టీఆర్ తన టెంపర్ ఏంటో ప్రేక్షకులకు రుచి చూపించడానికి రెడీ
అవుతున్నాడు. ఇక టెంపర్ విషయానికి వస్తే సినిమా
ప్రారంభం లో అంతగా కిక్ ఇవ్వలేదు కానీ ఆడియో ముందు నుండి ఈ టెంపర్ కి టెంపర్ పెరిగింది. ఇక ట్రైలర్
,సాంగ్స్ చూసాక టెంపర్ పై అంచనాలు భారీ
స్తాయిలో పెరిగి ఇప్పుడు టెంపర్ కు పాజిటివ్ టాక్ వస్తోంది.
టెంపర్ చిత్ర నిర్మాత
బండ్ల గణేష్ , హీరో ఎన్టీఆర్ తో రెండో సినిమా. మొదట వచ్చిన
బాద్ షా యావరేజ్. తనకి బాగా ఇష్టమైన
హీరో
పవన్ కళ్యాణ్ తో గణేష్ రూపొందించిన మొదటి సినిమా తీన్ మార్ ఫ్లాప్. పవన్ తో గణేష్ సెకండ్ మూవీ గబ్బర్ సింగ్
సెన్సేషన్ హిట్. ఆ
యాంగిల్లో చుస్తే
గణేష్ , ఎన్టీఆర్ నుంచి
వస్తున్న టెంపర్ సెన్సేషనల్ హిట్ అయ్యే అవకాశం ఉన్నది అంటున్నారు. తప్పకుండా ఎన్టీఆర్ కెరీర్ లో ఓ బ్లాక్ బస్టర్ గా
నిలుస్తుందని అంటున్నారు. పూరి జగన్నాద్ దర్శకత్వంలో
తెరకెక్కిన టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా ప్రకాష్ రాజ్ విలన్ గా
నటించాడు. ఫిబ్రవరి 13న ఈ చిత్రం రిలీజ్ కానుండటం తో నందమూరి అభిమానులు
మరో విజయం కోసం తహతహలాడుతున్నారు.
Post a Comment