మహేష్ బాబు 'శ్రీమంతుడు' కాదు 'జమీందార్'
మహేష్‌బాబు కొత్త సినిమా పేరు ‘శ్రీమంతుడు’ అని ఇప్పటివరకు ప్రచారం సాగింది. దీన్ని
మార్చి ‘జమీందార్’ అనే టైటిల్ని పెట్టనున్నట్టు తెలుస్తోంది. ‘శ్రీమంతుడు’ టైటిల్ క్యాచీగా లేదని చాల పాత టైటిల్ తరహాగా వుందని, దీని పేరు మారిస్తే బాగుంటుందని యూనిట్
సభ్యులు చెప్పడంతో
ఆలోచనలోపడినట్టు సమాచారం. ఈ క్రమంలో కొత్త పేరు ‘జమీందార్’ వెలుగులోకి వచ్చింది. దాదాపుగా దీన్ని ఫైనల్
చేయవచ్చని ఫిల్మ్ నగర్ టాక్. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి,
సావిత్రి జంటగా 1965లో ‘జమీందార్’ మూవీ వచ్చింది. అప్పట్లో ఈ చిత్రం
బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టింది
కూడా! నాలుగేళ్ల కిందట నాని హీరోగా వచ్చిన ‘పిల్ల జమీందార్’ మంచి హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రిన్స్ మూవీకి ‘జమీందార్’ పేరుని ఓకే చేసినట్టుగా చెబుతున్నారు. మరి దీనిపై
క్లారిటీ రావాలంటే మహాశివరాత్రి వరకు ఆగాల్సిందే! ఎందుకంటే ఆ రోజు ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్
లుక్‌ని డైరెక్టర్
కొరటాల శివ విడుదల చేయనున్నాడు.
Post a Comment