GuidePedia

0

ఎదుగుదలకి అడ్డు పడినందుకే చిరుపై కోపం...

యాంగ్రీయంగ్ మాన్ గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన డా..రాజశేఖర్ కు , చిరంజీవికి ఏ మాత్రం పడదనే అనే విషయం అందరికి తెలిసిందే ఇందుకు సంభందించి కొన్ని కారణాలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచినా ఠాగూర్ సినిమా తెలుగు రీమేక్ విషయంలోనే రాజశేఖర్ కి చిరుతో అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. అయితే ఈ దూరాన్ని పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మరింత పెంచిందని పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. పరిశ్రమలో వినిపిస్తున్న వార్తల ప్రకారం….రాజశేఖర్ కెరీర్ నిలబెట్టుకోవడానికి హిందీ సినిమా దబాంగ్ ని తెలుగులో రీమేక్ చేసేందుకు ముంబై వెళ్లి ఆ చిత్ర నిర్మాతలకి 1.5 కోట్లు ఆఫర్ చేశాడట రాజశేఖర్.ఈలోపు పవన్ కళ్యాణ్ ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం ఏకంగా 1.75 కోట్లు ఆఫర్ చేయడంతో ఆ నిర్మాతలు  పవన్ కళ్యాణ్  వైపు మొగ్గు చూపారట. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న రాజశేఖర్ తన ఎదుగుదలకి మెగా ఫ్యామిలీ అడ్డు తగిలింది అనే కోపాన్ని పెంచుకున్నాడట. అయితే ప్రస్తుతం మరీనా పరిస్థితుల్లో రాజశేఖర్ చిరంజీవితో స్నేహాన్ని పెంచుకోవాలని ఆశిస్తున్నట్లు మీడియాతో చెబుతున్నారు. దాంతో రాజశేఖర్ కి కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమిటో కానీ రేపు రాబోతున్న గడ్డం గ్యాంగ్ కనీస విజయం రాజశేఖర్ కెరీర్ కి కీలకంగా మారింది. కాబట్టి రాజశేఖర్ కి ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుందాo.


Post a Comment

 
Top